వీడని మెచ్చుకోవాలి ప్రశంసా పత్ర మివ్వాలని చేయటం సత్కారం కోసం. పదిమందీ తనకు ఎదురు వచ్చి సగౌరవంగా అభివాదనం చేయటం మానార్ధం. అలాగే పాదప్రక్షాళనా అర్చనా చేసి షడ్రసోపేతంగా భోజనం పెట్టి పంపాలను కోటం పూజార్థం. ఇది భగవత్పాదులు కూడా చూచి ఉంటారానాటి సన్న్యాసులలో. అందుకేనేమో చిలువలు పలువలు వర్ణిస్తున్నారు వారి వ్యవహారం మనం జాగ్రత్త పడటానికి. ఎవడంటే వాడి నమాయికంగా నమ్మి వాడి వెంటబడి పోకుండా మసలుకోటానికి.
అంతేకాదు. తపో దంభేన చైవ యత్రియతే - తన స్వాతిశయం చూపటాని కార్భాటంగా సాగించినా అది రాజసమే అనిపించుకొంటుంది. ఫలితం లేదా అంటే ఉంటుంది అంతో ఇంతో. అయితే చల మధ్రువం ఎప్పటికప్పుడు తొలగిపోయేదే. ఎప్పటికీ నిలిచేది గాదు - దక్కేది గాదు. కాదా చిత్క ఫలమన్నారు భగవత్పాదులు. సాత్త్వికంలాగా శాశ్వతికమైన ఫలాన్ని ప్రసాదించ బోదు.
మూఢ గ్రాహేణా త్మనోయ - త్పీడయా క్రియతే తపః
పరస్యోత్సాదనార్ధం వా తత్తామస ముదాహృతమ్ - 19
పోతే ఇక తామసమైన తపస్సున్నది. అంతకన్నా నికృష్టమైనది. నీచమైనది. మూఢగ్రాహేణ. ఏమాత్రమూ ముందు వెనుకలు చూడకుండా మొండిపట్టు పట్టి చేసే తపశ్చర్య. అది కూడా ఆత్మనః పీడయా. తన