#


Index

శ్రద్ధాత్రయ విభాగ యోగము

పోతుంది కాబట్టి గుణ సంపర్కం లేకుండా చూచుకోండి. బాగు పడతారని మానవులందరినీ హెచ్చరించటానికే మొదట గుణ కలుషితం కాని పరిశుద్ధమైన తపస్సెలాంటిదో చూపి తరువాత అదే కలుషితమైతే ఎంత అనర్థదాయకమో వివరిస్తున్నా డిప్పుడు మనకు.

శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః
అఫలాకాంక్షిభి ర్యుక్షైః - సాత్త్వికం పరిచక్షతే - 17

సాత్త్వికమైన తపస్సనే దెలాంటిదో పేర్కొంటున్నాడు మొదట. శ్రద్ధయా పరయా తప్తం తపః - ఎంతో శ్రద్ధాసక్తులుండే చేయవచ్చు ఏతపస్సైనా. దేనికి తగిన శ్రద్ధ దానికుండనే ఉంటుంది. అది సాత్త్వికమే కానక్కర లేదు. రాజస తామసాలకైనా వర్తిస్తుంది. అసలు చేసే దాని మీద శ్రద్ధ లేకుంటే ఏ పనీ చేయలేడు. ఫలితమూ పొందలేడు. ఎటు వచ్చీ అది సాత్త్వికమా మరొకటా అనే ప్రశ్న. సత్త్వాది గుణాలను మూడింటినీ బట్టి మూడు విధాలైనదా శ్రద్ద. దాన్ని బట్టి త్రివిధం తపః - మూడు విధాలు తపస్సు కూడానని అర్థం చేసుకోవాలి మనం. అందులో అఫలా కాంక్షి భి ర్యుక్షైః సాత్త్వికం పరిచక్షతే. ఫలాకాంక్ష ఏమాత్రమూ లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో ఏకాగ్రత కలిగి చేసే తపస్సేదైతే ఉందో దాన్ని సాత్త్వికమని నిర్దేశిస్తారు పెద్దలు.

  చూచారా. సాత్త్వికమని ఎక్కడ చెప్పినా అది యజ్ఞమే కావచ్చు. దానమే కావచ్చు. తపస్సే కావచ్చు. ఫలా కాంక్ష ఉండగూడదని మాటి

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు