ఉన్నంత వరకూ రాదు. కాగా అందులోనే సత్త్వర రజస్తమస్సులనే ప్రకృతి గుణాలు సంక్రమించ బోతుంటే చాలు. ఎక్కడ లేని ప్రమాదమూ వచ్చి పడుతుంది. గుణ సంపర్కమే అన్ని వైవిధ్యాలకూ వైషమ్యాలకూ మూలం అది లేనంతవరకూ యజ్ఞమైనా తపస్పైనా దానమైనా మూడూ మంచివే. మనకు మేలు చేసేవే.
అయితే అలాంటప్పుడు మూడింటినీ సాత్త్విక రాజస తామసాలనే మూడుగా విభజించి చెప్పవచ్చు గదా. అందులో తపస్సు మాత్రమే కేటాయించి దాన్ని గుణ రహితంగా మంచిదని గుణ సహితంగా మంచీ చెడ్డ అనీ బోధించట మెందుకని ఆశంక. దీనికి సమాధాన మేమంటే దేనికైనా మానవుడి మనస్సే మూలం. యజ్ఞం కాదు దానం కాదు. అవి రెండూ వాటి పాటికవి ఏర్పడటం లేదు. మనస్సు సంకల్పిస్తేనే ఒక యజ్ఞమనేది బాహ్యంగా ఆచరిస్తున్నావు. ఒక దానమనేది చేస్తున్నావు. సంకల్పించ కుండా ఏది చేయగలవు. పోతే సంకల్పమనేదే తపస్సు. యస్య జ్ఞానమయం తపః అన్న దుపనిషత్తు. జ్ఞానమే తపస్సంటే. తపించటమే గదా తపస్సనే మాట కర్ధం. అది ఎక్కడ తపిస్తావు. మనసులో. అదే మాటలో - చేష్టలో జారీ అవుతుంది తరువాత. కనుక మనస్సంకల్ప రూపమైన తపస్సుకే ఉంది మిగతా రెండింటికన్నా ప్రాధాన్యం. అది ప్రాకృతమైన గుణాలతో కలుషితమైతే పురుషార్ధ సాధనకు పనికిరాకుండా