నిశ్చయం చేసుకొంటనే గదా నోరు దెరచి మాటాడవు. కాబట్టి కార్యాన్ని బట్టి కారణాన్ని అర్థం చేసుకొంటే మౌనం మానసికమే మొదట. ఆత్మ నిగ్రహమో. ఆత్మను నిగ్రహించట మేమిటి. ఆత్మ అంటే ఇక్కడ. ప్రత్యగాత్మ కాదు. దానికుపాధి భూతమైన మనస్సు. మనో నిరోధమనే పేర్కొంటున్నారు భాష్యంలో. అందులో కూడా మనో నిరోధం వాగ్విషయం మాత్రమే అయితే మౌనమని - అలాకాక సర్వసాధారణమైతే ఆత్మ వినిగ్రహమని తేడా చూపారాయన రెండింటికీ.
కాగా ఆఖరిది భావ సంశుద్ధిః - భావంలో శుద్ధి నిజాయితీ. వ్యవహార కాలే అమాయికత్వం. లోకులతో వ్యవహరించేటపుడు ఏవిధమైన కల్లా కపటం లేకుండా బాగుగా వ్యవహరించటం నేర్చుకోవాలి. ఇలాంటి గొప్ప గుణాలన్నీ తపో మానస ముచ్యతే. మానసమైన తపస్సు క్రిందికి వస్తాయి.
ఇంతవరకూ కాయిక వాచిక మానస తపస్సులు మూడూ వర్ణించాడు మహర్షి ఒక విశేషమేమంటే ఇవి మూడూ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనే ప్రశ్నే లేదు. ఇంతకు ముందు యజ్ఞంలో ఇకముందు దానంలో చెప్పబోయే ఉత్తమ మధ్యమాధమ రూపమైన తారతమ్యం లేదిందులో. శరీరమూ - వాచికమూ - మానసికమూ - మూడూ ఉత్తమమే. మూడూ మానవుడికి వాంఛనీయమే. అవశ్యంగా జీవితంలో పాటించవలసినవి కూడా. అయితే ఆ విభాగమెక్కడ వస్తుందని ప్రశ్న. అది తపస్సు తపస్సుగా