#


Index

శ్రద్ధాత్రయ విభాగ యోగము

మనః ప్రసాద స్సౌమ్యత్వం- మౌన మాత్మ వినిగ్రహః
భావ సంశుద్ధిరి త్యేత -త్త పో మానస ముచ్యతే - 16

  పోతే ఇక మానసమైన తపస్సు సంగతి బయటపెడుతున్నాడు. అదేమిటి ఎలా ఉంటుందని అడిగితే చెబుతున్నాడు దాని లక్షణాలొక్కొక్కటీ. మొదటిది మనః ప్రసాదః మనసనేది నిర్మలంగా ఉండాలి. ప్రసాదమంటే స్వచ్ఛత్వం నిర్మలత్వమనే అర్థం. సహజంగా ఉండదది. మనం కలిగించుకోవాలి దాన్ని. స్వచ్ఛతా పాదన మంటున్నారు భాష్యకారులు. స్వచ్ఛత్వం సహజంగా లేకుంటే ప్రయత్న పూర్వకంగా తెచ్చుకోవాలట. రెండవది సౌమ్యత్వం. సౌమనస్యమని అర్థం. మంచి మనస్సుండటం. అది ఎలా చెప్పగలమంటే వ్రాస్తున్నారు భగవత్పాదులు. ముఖాది ప్రసాదాది కార్యోన్నేయా అంతః కరణస్య వృత్తిః - వృత్తి రూపమే గదా మనస్సంటే. అందులో ఏ వృత్తి లోపల ఉందో పైకి కనిపించే ముఖ కవళికలను బట్టే పోల్చుకోవచ్చునట. Face is the index of mind అనే మాట కూడా ఇందుకే పుట్టింది.

  పోతే మౌనం. ఆత్మ వినిగ్రహః - ఇవి రెండు లక్షణాలు. మౌనమంటే మాటాడకుండా ఉండటం. మాటాడక పోవటం వాఙ్మయ తపస్సు క్రిందికి వస్తుంది గదా అంటే అలా కాదు. వాజ్నియ మోపి మనస్సం యమ పూర్వకో భవతి అంటారు ఆచార్యుల వారు. మనస్సులో మాటాడగూడదని

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు