
లోకంలో అందరూ మొగమిచ్చకంగా మాటాడే వారే నూటికి తొంభయి మంది. అప్రియస్యచ పథ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభః - కానీ ఒకరి కిష్టమైనా కాకున్నా వారికేది హితమో అలాటి మాట చెప్పేవారు మాత్రం చాలా అరుదు. అంతే కాదు. అలా హితం చెప్పే వాడూ లేడు. చెబితే విని దాని నర్ధం చేసుకొనే వాడంత కన్నా లేడని ఘంటాపధంగా చెబుతాడు. అప్పటికి ముఖ ప్రీతిగా మాటాడటమే కాదు గొప్ప. దానితోపాటు వారికది మేలు చేసేదయి ఉండాలి. మేలు చేయక కీడు చేసేదయితే ఆ మాట ఎంత సత్యమైనా ఎంత ఇష్టమైనా చివరకు కష్టదాయకమే. సత్యం కన్నా ప్రియంకన్నా కోరదగినది మానవుడికి హితమేనని చివరకు తేలిన విషయం.
Page 383
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు