అలవరుచుకొంటే శారీరం తపః ఉచ్యతే - శరీరంతో చేసే తపస్సంటారట దీన్ని.
అనుద్వేగ కరం వాక్యం సత్యం ప్రియ హితంచ యత్
స్వాధ్యాయా భ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే - 15
పోతే వాచికమైన తపస్సేదో అది వర్ణిస్తున్నాడు. అనుద్వేగకరం
వాక్యం. ఒకరికి బాధ కలిగించే మాట ఎప్పుడూ మాటాడగూడదు. తనకే
అలాటి బాధ ఎవరైనా కలిగిస్తే ఎలా ఉంటుందో ఊహించుకొని అలాటి
ఉద్వేజకమైన ప్రసంగం చేయకుండా ఉండటం చాలామంచిది. సత్యం
ప్రియ హితంచ యత్. అంతేకాదు. చెప్పిన మాట సత్యమయి ఉండాలి.
ఉన్నదున్నట్టు మాటాడాలి. అది కూడా ఇతరులకు ప్రియంగా ఉండాలి.
సత్యం చెప్పమన్నారు గదా అని కఠినంగా చెప్పగూడదు. సున్నితంగా
బోధించాలి. అదే మర్యాద. ఇంకా ఒకటున్నది మాట. సత్యమూ ప్రియమే
గాక వాడికది హితమయి ఉండాలి కూడా. అంటే దానివల్ల ఎలాటి కీడూ
కలగకూడదు. సాధ్యమైనంత వరకూ మేలు చేసే మాటే చెప్పవలసి
ఉంటుంది. అందుకే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాన్న బ్రూయాత్సత్య
మప్రియ మంటారు పెద్దలు.
రామాయణంలో మారీచుడు రావణుడికి చేసిన హిత బోధ జ్ఞాపకం వస్తున్నది. సులభాః పురుషారాజన్ సతతం ప్రియ వాదినః రాజా