దాత్తాది స్వరమూ వినిపించదు. వర్ణాలను కూడా చక్కగా ఉచ్ఛరించే దిక్కు లేదు. ఏదో ఎక్కాలు చదివినట్టు ఇష్టానుసారంగా వేదమంత్రాలను చదువుతూ పోవటమే.
అంతేకాదు. అదక్షిణం. సదస్యులకు దక్షిణ డబ్బులిచ్చే బాపతు కూడా లేదు. పైసా సంభావన లేదెవరికీ. మన పిచ్చి కాకుంటే అన్న దానమే చేయని వాడు సదస్య సంభావనా. అది కలలోని వార్త. ఇంతకూ ఏమిటీ అన్యాయం. అన్యాయమే మరి. శ్రద్ధా విరహితం. శ్రద్ధ అనేది ఉంటే గదా దేనికైనా. శ్రద్ధా భక్తులే ఉంటే శాస్త్రోక్తంగా చేసేవాడు. నలుగురికీ భోజనం పెట్టి తృప్తి పరిచే వాడు. అసలు మానవుల మాట అలా ఉంచి దేవతా ప్రీత్యర్థమైనా మంత్రాలను చక్కగా ఉచ్చరించి హోమకార్యం నిర్విర్తించేవాడు. శ్రద్ధకే నోచుకోని వాడేది గానీ సలక్షణంగా ఎలా చేయగలడు. అందుకే తామసం పరిచతే. తామసమైన యజ్ఞమని దానికి ముద్ర వేశారు పెద్దలు.
దేవద్విజ గురుప్రాజ్ఞ పూజనం శౌచ మార్జవం
బ్రహ్మ చర్య మహింసాచ శారీరం తప ఉచ్యతే - 14
పోతే యజ్ఞం మూడు విధాలైన తరువాత ఇప్పుడు తపస్సనే దేమిటో వర్ణిస్తున్నాడు. ఇందులో కూడా మూడున్నాయి అంతస్తులు. అవి సాత్త్విక రాజస తామసాలే అయినా అంతకు ముందు మరొక మూడున్నాయి. ఒకటి శారీరం. మరొకటి వాఙ్మయం. ఇంకొకటి మానసం. అయితే యజ్ఞం