#


Index

శ్రద్ధాత్రయ విభాగ యోగము

చేసేదైతే ఇది అలా కాదు. వల్ల మాలిన కోరిక పెట్టుకొని చేసేది. ధనధాన్యాదుల మీదా పుత్ర పౌత్రాదుల మీదా భోగ భాగ్యాల మీదా ఎక్కడలేని ఎడ తెగని కోరిక లెన్నైనా ఉంటాయి ఇందులో. ఒకటి తీరితే ఒకటి. ఆశ కంతు లేదు. దీనివల్ల మమకార మనేది ఉంటుందనేది అర్థమయిందీ రాజసమైన యజ్ఞంలో. అంతేకాదు. అహంకారానికి కూడా తక్కువ లేదు. దంభార్ధ మపి చైవ యత్త నటంలో అది కూడా ధ్వనిస్తున్నది దంభం కోసమని చేస్తుంటారట ఇలాటి యజ్ఞం. దంభ మంటే ఏమిటో ఇంతకుముందే వచ్చింది. దాని అర్థం భగవత్పాదులు వివరించారు కూడా. ఏమని. ధర్మ ధ్వజిత్వ మన్నారాయన. చాలా చక్కని మాట ఇది సంస్కృతంలో. ధ్వజమంటే జెండా. తాను చేసేది ధర్మ కార్యమని గుర్తిస్తారో లేదో లోకులని ఒక జెండా ఎత్తి చూపినట్టు నలుగురికీ చాటి చెప్పటమని అర్థం. అంటే పదిమందీ మెచ్చుకోవాలని డాంబికంగా చేయటమే గాని తన కందులో నిజాయితీ గాని పట్టుదల గానీ లేదని భావం. ఇదుగో ఇది అహంకారం క్రిందికి వస్తుంది.

  ఇలా అహంకార మమకారాలు పెట్టుకొని చేస్తే అది సాత్త్విక మెలా అవుతుంది. రాజసమే అవుతుంది. అహంకార మమకారాలే గదా కర్తృత్వ భోక్తృత్వాలని కూడా చెప్పాము. అవే మన కొంప తీసే గుణాలు. రెండూ రెండు కొసలు మనం చేసే ప్రతి పనికీ. అవే మన బుద్ధిని ప్రాపంచికమైన

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు