#


Index

శ్రద్ధాత్రయ విభాగ యోగము

చేయాలని చేస్తాడు జ్ఞాని. అలాగని ఏదో దీనివల్ల పురుషార్ధ ముంటుందని గాదు. అలాటి ఆశ లేదు జ్ఞానికి. ఉండటానికి వీలు కూడా లేదు. జ్ఞాని కదా వాడు. ఆశ పెట్టుకొంటే వాడేమి జ్ఞాని. అందుకే నానేన పురుషార్ధామమ కర్తవ్యః అని అర్థం వ్రాస్తున్నారు భగవత్పాదులు.

  కాకపోయినా పురుషార్థ మేముంటుంది వాడు కోరవలసింది. అర్థకామాలా ఐహికం. అదంతా మాయామయమే వాడి దృష్టికి. ఆముష్మికమా అది ధర్మమైతే అదీ వాడి దృష్టికి ఐహికంలాగా మిధ్యాభూతమే. పోతే ఇక మోక్షమనే దొకటి. బ్రహ్మ భావశ్చ మోక్షః అన్నారు శంకరులు. మోక్షం వాడి స్వరూపమే కేవలం. ఇక దాన్ని క్రొత్తగా కోరటం దేనికి. కాబట్టి నాలుగూ అక్కర లేదు జ్ఞానికి. అయినా చేస్తున్నాడంటే ఇంతకు ముందే చెప్పాడు గదా భగవానుడు. నాన వాప్త మ వాస్తవ్యం వర్త ఏవచ కర్మణి అని. నేను పొందవలసిన దంటూ ఏదీ లేకపోయినా కర్మ చేస్తుంటానని గదా ఆయన మాట. ఆయన మాటే ఈయన మాట కూడా. ఇదీ సాత్త్వికమైన యజ్ఞం.

అభిసంధాయ తు ఫలం దం భార్ధ మపి చైవ యత్
ఇజ్యతే భరత శ్రేష్ఠ - తం యజ్ఞం విద్ధి రాజసమ్ - 12

  పోతే రాజసమైన యజ్ఞ మేమిటని ప్రశ్న. సాత్త్వికానికి కేవలం వ్యతిరిక్త మిది. అభిసంధాయతు ఫలం అది ఫలం మీద కోరిక లేకుండా

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు