యజ్ఞాదుల అనుస్థానంలో శుద్ధి కావాలి మొదట మన త్రికరణాలూ. ఆ తరువాతనే సిద్ధి. యజ్ఞమంటే ఏమిటో వ్రాస్తున్నాడు వ్యాస భగవానుడు. సత్త్వర జస్తమో గుణాల త్రై విధ్యాన్ని బట్టి యజ్ఞం కూడా త్రివిధమే.
అందులో సాత్త్వికమైన యజ్ఞమే అఫలాకాంక్షిభిః విధిదృష్టః ప్రశస్తమైనది. అది ఫలం మీద కాంక్ష లేకుండా చేయవలసి ఉంటుంది. అంతేకాక విధి దృష్టం. నేను నా ఇష్టానుసారం సాగిస్తున్నానని కాకుండా శాస్త్రం విధించింది నాకిది. దాని ఆదేశాన్ని అనుసరించి ఆచరిస్తున్నానని భావించాలి. దీన్నిబట్టి కర్తృత్వ భోక్తృత్వ బుద్ధులు రెండూ వదిలేసి చేయవలసిన యజ్ఞమని తేటపడుతున్నది. అంటే అహంకార మమకారాలకు స్వస్తి చెప్పి నిష్కామంగా ఈశ్వరార్పణ బుద్ధితో చేసే యజ్ఞమిది. యజ్ఞం కాని యజ్ఞం. అంటే జ్ఞాన యజ్ఞం.
అయితే జ్ఞానముంటే చాలు గదా. యజ్ఞమనే బాహ్యమైన క్రియ దేనికది ప్రశ్న వస్తుంది. దానికి సమాధాన మిస్తున్నాడు గీతాచార్యుడు. ఏమని. యష్టవ్యమే వేతి మనస్స మాదాయ. ఏదో చేయక తప్పదని చేయటమే నంటాడు. అలాగే మనసులో సమాధానపడి చేయాలట. ఏమి ఎందుకని. ఎంత జ్ఞానికైనా ప్రారబ్ధమనే దొకటి ఉంటుంది. అది ఊరక కూచోనివ్వదు. ఏదో ఒకటి చేయిస్తుంటుంది వాడి చేత. అలాంటప్పుడు ఆ చేసేదేదో శాస్త్ర సమ్మతమైన మంచి కార్యమే చేస్తే సరిపోలా. అందుకే