#


Index

శ్రద్ధాత్రయ విభాగ యోగము

మింగే బాపతు వారు కూడా ఉన్నారని వినికిడి. వినికడే గాదు. టీవీలో చూస్తుంటాము కాబట్టి కనికిడి కూడా.

  ఇక్కడికి ఆహార విషయ మయింది. అది సత్త్వరజస్తమో గుణాలను బట్టి మూడు విధాలుగా వర్ణించి చెప్పారు. అందులో కూడా ఆహారాన్ని గాక ఆహారాన్ని సేవించేవారిని పేర్కొనటంలో విశేషముంది. అదేమిటంటే ఆహారమెలాంటి దైనా కావచ్చు. మంచీ చెడ్డా అందులో కనిపించదు మనకది జడ పదార్ధం. మంచి అయితే దానికి ఒరిగింది లేదు. చెడ్డదైతే తరిగింది లేదు. కాగా దాన్ని ఎవరు సేవిస్తారో ఆ మానవులకే దానివల్ల కలిగే మంచి చెడ్డలు. అంచేత వివేకవంతులైన మానవులిది గమనించి మసలు కోవాలి సుమా అని శాస్త్రం మనకందరికీ చేసే హెచ్చరిక ఇది.

అఫలా కాంక్షిభి ర్యజ్ఞో - విధి దృష్టోయ ఇజ్యతే
యష్ట వ్యమే వేతి మన - స్సమాధాయ - స సాత్త్వికః - 11

  పోతే ఇక యజ్ఞదాన తపస్సులనే మూడింటి విషయం చెప్పబోతున్నాడు. ముందే సూచన చేశాము గదా యజ్ఞాదులు మూడూ మనోవాక్కాయాలు మూడింటికీ సంబంధించినవని. మనోవాక్కాయాలు మూడూ మన వశంలో ఉన్నప్పుడే మానవుడేదైనా పురుషార్ధాన్ని సాధించటానికి సమర్ధుడవుతాడు. లేకుంటే వ్యర్ధమే వాడి జీవితం. పశుపక్ష్యాదులలాగే బ్రతుకుతుంటాడు. ఏమి ప్రయోజనం. కాబట్టి

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు