#


Index

శ్రద్ధాత్రయ విభాగ యోగము

  అలాగే ఉచ్ఛిష్టమపి చామేధ్యం. ఉచ్ఛిష్టమూ అమేధ్యమూ అయిన భోజనం కూడా నిషిద్ధమే. భుక్త శేషాని కుచ్ఛిష్టమని పేరు. ఎంగిలి కూడన వచ్చు. లేదా తానే సగం తిని సగం మిగిల్చిందైనా కావచ్చు. రెండూ తప్పే తప్పెలా అవుతుంది. భర్త ఎంగిలి భార్య తినవచ్చు. అలాగే గురువుగారి ఎంగిలి శిష్యులు కూడా తినాలంటారు గదా లోకంలో. పైగా అది చాలా పవిత్రమనే అభిప్రాయం కూడా ఉంది లోకులకు. వాస్తవమే - కాని అది ఎంగిలి కాదు. నోట్లో పెట్టుకొని విస్తట్లో వదిలేసిందని కాదు అర్థం. ఉచ్ఛిష్టమంటే భుక్త శేషమని గదా చెప్పాము. అంటే భర్తగాని గురువుగాని వారు తినగా ఇంకా మిగతా వారు తినటానికి పాత్రలో మిగిలి ఉన్న భోజ్య పదార్ధాలని అర్థం. అవి ఎవరూ నోరు పెట్టింది కాదు. కనుక స్వీకార్యమే. పత్నీశిష్యాదులకు. అమేధ్యమంటే మేధ్యం కానిది. మేధ్యమంటే పరిశుద్ధమని అర్థం. అప్పటి కమేధ్యమంటే అపరిశుభ్రమైన ఆహారం. క్రిమి కీటకాది దూషితం. అది పరమ జుగుప్సాకరం. ఏమాత్రమూ పనికి రాదు. అవతల పారేయాలి. అయినా తామస ప్రియం. ఇలాంటి భోజనం చేయటాని కలవాడు పడ్డారు తామస స్వభావులైన మానవులు. ఇక పశుపక్ష్యాదులకూ మృగాదులకూ మానవులకూ తేడా ఏముందో మీరే చెప్పండి. ఇంకా పైకి చెప్పగూడదు గాని కొన్ని కొన్ని దేశాలలో కొంతమంది మానవులు సర్ప వృశ్చికాది శరీరాలను కూడా చెరకు నమలి నట్టు నమలి

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు