#


Index

శ్రద్ధాత్రయ విభాగ యోగము

చెబుతున్నాడిప్పుడు. రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః ఈ నాలుగూ దాని లక్షణాలు. రసవంతంగా బాగా రుచిగా ఉండాలది. స్నిగ్ధాః - ఘృత తైలాదులతో పక్వమై బాగా ఆర్థంగా ఉండాలి. స్థిరాః శరీరంలో ఎప్పటికప్పుడు నశించిపోకుండా ఒంట బట్టే వరకూ గట్టిగా నిలిచి ఉండాలి. హృద్యాః మనస్సుకి బాగా ఇష్టమైనదయి ఉండాలి. అలాంటి ఆహారమే సాత్త్వికమైన మానవులిష్ట పడి సేవిస్తుంటారు.

కట్వామ్ల లవణాత్యుష్ణ - తీక్ష రూక్ష విదాహినః
ఆహారా రాజస స్యేష్టా - దుఃఖ శో కామయ ప్రదాః - 9

  ఇక రాజసులైన మానవుల కెలాటి ఆహార మిష్టమో చెబుతున్నాడు. కట్వామ్ల లవణాత్యుష్ణ. కటు అంటే కారం. ఆమ్ల అంటే పులుపు. ఉష్ణ అంటే వేడి. తీక్ష అంటే ఘాటు. రూక్ష మరీ ఘాటు. విదాహి కంఠనాళం కాలిపోయేంత వేడి. అతి అనే మాట ఉష్ణ అనే దానికి ముందున్నా అది ఒక ఉష్ణ గుణానికే గాదు. కటు దగ్గరి నుంచి విదాహి వరకూ అన్నింటికీ వర్తిస్తుందంటారు. భాష్యకారులు. అతికటు అత్యామ్ల అతి లవణ ఇలా ఊహించుకోవాలి మనం. ఏ రసమైనా ఏ రుచి అయినా అతిగా ఆస్వాదించటం పనికి రాదు. తీక్షణ్ణ రూక్ష విదాహు లసలే పనికిరావు. విదాహి అంటే వేడి వేడి కాఫీ వగైరా పానీయాలే గాదు. మద్యపానాదులు కూడా. తీక్షణ రూక్ష అంటే మాంసాహారాదులు కూడా నని అర్థం

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు