ఆహార తపోదాన యజ్ఞాలను నాలుగింటినీ త్రిగుణాలను బట్టి ఒక్కొక్క దాన్ని మూడుగా విభజించి అందులో సాత్త్వికమైన దాన్నే అవలంబిస్తూ పొమ్మని మనకు సలహా ఇస్తున్నది గీత. అది ఎలాగో చూతాము.
ఆహార స్వపి సర్వస్య- త్రివిధో భవతి ప్రియః
యజ్ఞ స్తప స్తథా దానం- తేషాం భేద మిమం శృణు - 7
మొట్టమొదట అవి ప్రతి ఒక్కటీ ఎన్ని విధాలో మనకు సంగ్రహంగా చెబుతున్నది. ఆహార స్వపి సర్వస్య త్రివిధో భవతి - ప్రతి ఒక్కడీ లోకంలో ఆహారం తీసుకొంటూనే ఉన్నాడు. తీసుకోక తప్పదు కూడా. అది మనసులో ఆలోచనా రూపంగా - శరీరంలో క్రియా రూపంగా నడుస్తూనే ఉంటుంది. కాని అందులో మూడు జాతులున్నాయని సాధారణంగా మనం గుర్తించం. వాటిలో సాత్త్విక ముంది రాజసముంది తామసముంది ఎవరి దృష్టికి వారికవి ఇష్టంగానే కనిపిస్తుంటాయి. అందరికీ అన్నీ ఇష్టం కావు. రాజసతామసాలవైపే తరుచుగా మొగ్గు చూపుతుంటారు. సాత్త్వికం సేవిద్దామనే ఆలోచన ఏ కొద్దిమంది సాధకులకో గాని కలగదు.
అలాగే యజ్ఞస్తప స్తధా దానం. తపోదాన యజ్ఞాలు కూడా ఉన్నాయి. అవీ ఒక్కొక్కటీ సాత్త్వికాది భేదంతో మూడు విధాలు. అందులో కూడా