#


Index

శ్రద్ధాత్రయ విభాగ యోగము

తొలగిపోతాయి. కాబట్టి ఆహారమనే పునాది మీద ఆధారపడి ఉంది మోక్షసాధన మహాసౌధ నిర్మాణమంతా.

  దానికి మరలా శ్రద్ధ అనేది మూలాధారం. ఆహారమెలాటిది తీసుకోవాలో ఎలాటిది తీసుకోరాదో దానికి శ్రద్ధ ఉండాలి. ఆహారం వల్ల మనస్సు శుద్ధి అయి సాత్త్వికమైన జ్ఞానాన్నే పట్టుకొని రాజసతామసాలు వదిలేయాలంటే దానికీ శ్రద్ధ ఉండాలి. అది మరలా జీవితంలో ప్రతి వ్యవహారంలో తొంగి చూడాలంటే అదీ ఏమరకుండా పట్టుకొని ప్రయాణం చేసే శ్రద్ధ ఉండాలి. అంటే అప్పటికేమన్న మాట. ఆహారమేమిటి తపస్సేమిటి. దానమేమిటి - యజ్ఞమేమిటి. వీటన్నిటికీ హేతుభూతమైనదీ వీటన్నిటినీ ఎక్కడికక్కడ విడవకుండా పట్టుకొని నడుపుతూ పోయేదీ చివరకు మోక్షమనే గమ్యం వరకూ మానవుణ్ణి వెంబడించి వచ్చేదీ శ్రద్ధ అనే గుణమే మరేదీ గాదు. ఇదే ధర్మరాజు జీవితాన్ని మొదటి నుంచి చివరిదాకా నడుపుతూ వచ్చినట్టు వేదవ్యాసుడు మహాభారతంలో కధా ముఖంగా వర్ణిస్తూ వచ్చాడు. పోతే ఇప్పుడలాటి శ్రద్ధ మన ఆహార విధానం దగ్గరి నుంచీ మొదలవుతుంది కాబట్టి ప్రతిదశలోనూ రాజసతామసాలను పరిహరిస్తూ సాత్త్వికమైనవి సేవించటానికే మానవుడు శ్రద్ద వహించాలి. అందుకే

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు