అప్పటికే మయింది. తపస్సు దానం యజ్ఞం. ఇవి మూడూ వరుసగా మనోవాక్కాయాలనే త్రికరణాలకూ సంబంధించినవి. త్రికరణ శుద్ధిగా సాగాలి మానవుడి జీవితం. ఎప్పుడది. మానసికంగా సజాతీయమైన బ్రహ్మ వృత్తి నవలంబించి వాచికంగా దానికి విజాతీయమైన భావాల నన్నింటినీ పరిత్యజిస్తూ శారీరకంగా ఆ దృష్టితోనే సమస్త వ్యాపారాలనూ సాగిస్తూ బ్రతికినప్పుడే సాధకుడు శుద్ధుడూ సిద్ధుడూ అనిపించుకొంటాడు. అయితే ఇలాటి మహాభాగ్య మందుకోవాలంటే దీనికి పునాది లాంటిది మొట్టమొదట ఒకటున్నది. అది ఆహార శుద్ధి. ఆహారమంటే అది కేవలం శరీరానికి తీసుకొనేది గాదు. మనస్సుకు కూడా ఉంది ఆహారం. ఆప్రియతే ఇత్యాహారః - లోపలికి తీసుకొనేదేదో అదీ ఆహారమనే మాటకర్థం. అది శరీరంలోకైనా కావచ్చు మనసులోని కైనా కావచ్చు. రెండూ ఆహారమే. రెండూ శుద్ధి కావలసి ఉంది. ఆహార శుద్ధె సత్త్వ శుద్ధిః ఆహారం పరిశుద్ధమైతే సత్త్వం శుద్ధి అవుతుందన్నాడు సనత్కుమారుడు. అంటే సాత్త్వికమైన భావాలు మనసులో ఉదయిస్తే అది శుద్ధమవుతుంది. అప్పుడే ధ్రువాస్మృతిః ఆత్మ జ్ఞానమనేది ఉదయించి అది దృఢంగా నిలుస్తుందట. సత్త్వా త్సం జాయతే జ్ఞానమని గదా గీత పేర్కొన్నది. అప్పుడే సర్వగ్రంథీనాం విప్రమోక్షః - విజాతీయమైన ప్రాపంచిక వాసనలూ వృత్తులూ