#


Index

శ్రద్ధాత్రయ విభాగ యోగము

చెప్పారాయన దైవ్యా ఆదానాయ ఇతరయోః పరివర్జనాయ అని. గుర్తుంది గదా. మంచి చెడ్డలు రెండూ శాస్త్రం చెప్పవలసిందే. మనం తెలుసుకోవలసిందే. అందులో మంచి నలవరుచుకోటానికి చెడ్డను త్రోసి పుచ్చుకోటానికి. ఇదీ పెద్దల అభిప్రాయం.

  పోతే ప్రస్తుతం యజ్ఞమనీ దానమనీ తపస్సనీ మూడు భావాలను వర్ణించబోతున్నాడు వ్యాసభగవానుడు. తపస్సనేది ఇంతకుముందుగానే పేర్కొన్నాడు గదా అంటే అది కేవలం సంగ్రహంగా ఉపోద్ఘాత ప్రాయంగా చెప్పిన మాట. మానవుడి సంకల్పాన్ని బట్టే వాడి మాటా ప్రవర్తనా ఉంటుందనే భావం మన కందివ్వటమే దాని ప్రయోజనం. అంతేగాని సాంగోపాంగంగా వర్ణించటం కాదది. ఇక్కడ అలాకాక యజ్ఞదానాలలో చేర్చి దాన్ని సవిస్తరంగా చెప్పబోతాడు. ఆ మూడింటినీ వర్ణించే ముందు దానికి కారణభూతమైన ఆహార విషయం కూడా ప్రప్రధమంగా వర్ణిస్తాడు.

  ఇంతకూ యజ్ఞదాన తపస్సు లేమిటి. అవే మన జీవితానికి సర్వస్వమా. అంతకన్నా వేరేమీ లేదా చెప్పవలసింది. అవి మూడే మన జీవితాన్ని నడుపుతున్నాయా - వాటివల్లనే జీవిత పరమార్ధమందు కోగలడా మానవుడు. అసలీ ఆహారమేమిటి. అది వీటికెలా తోడ్పడుతుంది అని ఇలాటి ప్రశ్న లెన్నో ఉదయిస్తాయి మన మనస్సులో. శ్రద్ధా త్రయ విభాగమనే అధ్యాయమిది. ఇందులో సాధన మార్గానికి శ్రద్ధ అనేది

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు