#


Index

శ్రద్ధాత్రయ విభాగ యోగము

కాదు. సాక్షాత్తుగా ఆ బాధ వీడను భవించక పోయినా అయ్యో చెప్పిన మాట వినక వీడు చెడిపోయాడే అని వాడి మీద కేవలం జాలిపడతాడు. అదే వాడు పడే బాధ. అంతకన్నా ఏమీ లేదు. అదైనా లోకంలో పెద్ద వాళ్లకొక శరీరమూ మనస్సనే ఉపాధులనేవి ఉన్నాయి కాబట్టి. పరమాత్మ కైతే అదీ లేదు. అంచేత బాధపడతా డనటం కూడా మన దృష్టితోనే. ఆయన దృష్టితో గాదు.

  ఇంతకూ ఈ పనికిమాలిన చర్య కంతటికీ కారణమేదో గాదు. తాన్ విద్యాసుర నిశ్చయాన్. ఆసురమైన సంపదతో పుట్టారు వారు. దానికి తగిన నిశ్చయమే ఏర్పడుతూంటుంది వారి మనస్సుకు. అదే ఈ పని చేయి ఆ పని చేయమని వారిని పురికొల్పు తుంటుంది. అలాటి దానిమీదనే శ్రద్ధ పెట్టుకొని ఆ మార్గాన్నే పట్టి పోతుంటారు. మతెంతో గతంత. యో యత్రతు స త్కర్మకురుతే - యత్కర్మ కురుతే తత్ఫల మభి సంధత్తే అని ఇంతకు ముందే పేర్కొన్నాము. ఎవడే ఫలితం కావాలని కోరుకొంటాడో ఆ పనే పెట్టుకొంటాడా ఫలమే అనుభవిస్తాడు. అంతకన్నా చెప్పేదేముంది. అయితే ఇది మానవుడికి వాంఛనీయం గాదు గదా. దీన్ని ఎందుకింత పని గట్టుకొని వర్ణించటమని అడిగితే చెబుతున్నారు భాష్యకారులు. పరిహరణార్ధం విద్ధీత్యుపదేశః - ఇలాటి అసుర బుద్ధి పనికిరాదు. కీడు తెస్తుంది మానుకోమని చెప్పటానికట ఈ వర్ణన. ఇంతకుముందే

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు