#


Index

శ్రద్ధాత్రయ విభాగ యోగము

కరణ సముదాయమని అర్థం వ్రాస్తున్నారు భాష్యకారులు. అంటే చక్షురాదులూ వాగాదులూ అయిన ఇంద్రియాలు. ఆన్నపానాదులు మానేసి తపస్సులో కూచుంటే ఏమవుతుంది. శరీరంతో పాటు ఇంద్రియాలు కూడా శుష్కించి పోతాయి. ఏ పనికీ తరం గాక డీలా పడిపోతాయి. శరీర మాద్యంఖలు ధర్మ సాధన మన్నారు. దాన్ని కాదని నీవు ఏమి సాధించగలవు. అయినా ఏదో సాధిద్దామని కూచున్నారంటే అచేతసః ఎంత తెలివి తక్కువ వారో చూడమంటాడు మహర్షి

  మాంచైవాంత శ్శరీరస్థం. బాహ్యమైన శరీరేంద్రియ క్రియలనే గాదు వీరు తపింప చేయటం. శరీరం లోపల ఉండి దీన్నంతా సాక్షిగా చూస్తున్న నన్ను కూడా బాధిస్తున్నారంటాడు పరమాత్మ. పరమాత్మ గదా ఆయన. ఆయనను వీరు బాధించట మేమిటి. బాధిస్తే మాత్రం బాధపడతాడా ఆయన. నిరాకారమైన వ్యాపకమైన చైతన్యం కదా పరమాత్మ అంటే. దానికి బాధేమిటి అని అడిగితే సమాధాన మిస్తున్నారు భాష్యకారులు. మదను శాసనాకరణమేవ మత్కర్శనం. నా ఆదేశాన్ని అనుసరించి బాగుపడక పోవటమే నన్ను వారు బాధించట మంటాడాయన. ఎంత చక్కగా ఉందో చూడండి వ్యాఖ్యానం. లోకంలో కూడా ఇంతే. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినకుండా కుర్రవాడు వాడి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడను కోండి. దానివల్ల వాడికేదైనా కీడు జరిగితే దానివల్ల వాడికే బాధ. సలహా ఇచ్చిన పెద్దవాడికేమీ

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు