అశాస్త్ర విహితం – అలాటి తపస్సు రెండు విధాలు. అది శాస్త్ర విహితమైనా కావచ్చు. అశాస్త్రీయమైనా కావచ్చు. రాజసతామస భావాలున్న వారు చేసేదంతా అశాస్త్రీయమే. అది ఘోరమైనదా తపస్సు. ప్రాణికోటికి పీడాకరమైనది. తప్యంతే. అలాటి శాస్త్ర విరుద్ధమైన తపస్సు చేస్తుంటారు వారు. ఏమి కారణం. వారి స్వభావ మలాంటిది. ఆసురమైన స్వభావమది. దానికి తగినట్టే దంభాహంకార సంయుక్తాః దంభమూ అహంకారమూ వదలిపెట్టరు. పదిమంది చూచి మెచ్చుకోవాలనే ప్రదర్శన దంభమైతే నేను కాబట్టి ఇంత గొప్పగా చేస్తున్నాననేది అహంకారం. అంతేకాదు. కామ రాగ బలాన్వితః - ఏవేవో కోరికలుంటాయి. అవి ఈ తపస్సు ద్వారా తీర్చుకోవాలనే అభిలాష ఎక్కువగా ఉంటుంది. అవి మనసులో బలంగా పనిచేస్తుంటే ఏమి చేయగలరు. వాటికి బానిసలయి అవి తమ్ము ఆదేశించిన మార్గంలోనే పయనిస్తుంటారు జీవితాంతమూ.
కర్శయంత శ్శరీరస్థం- భూత గ్రామ మ చేతసః
మాం చైవాంత శ్శరీరస్థం - తాన్ విద్యాసుర నిశ్చయాన్ - 6
అంతేకాదు. వారి మనసులో ఉండే ఆలోచన లింతబలంగా ఉంటే ఇక వారా ఆలోచనల కనుగుణంగా చేసే బాహ్యమైన చేష్ట మరీ దారుణం. కర్మ యంతి శరీరస్థం భూత గ్రామం - శరీరాన్నీ శరీరంలో ఉండే భూతగ్రామాన్ని కూడా కృశింప చేస్తుంటా రనవసరంగా. భూతగ్రామ మంటే