#


Index

శ్రద్ధాత్రయ విభాగ యోగము

ఈశ్వరుడు. అది వాడు పయోగించుకొని జీవిత గమ్యమైన మోక్షఫలమందు కోవాలనే శ్రద్ధ ఉన్నవాడైతే నిజంగా పురుషుడే. పూర్ణత్వమున్న వాడే. అలాకాక పశుప్రాయంగా బ్రతుకుతూ పోయాడో నిజంగా పశుపక్ష్యాదుల స్థాయికే పడిపోగలడు. అలాగే పడి ఇప్పుడీ లోకంలో నూటికి తొంభయి మంది జీవయాత్ర సాగిస్తున్నారు. అలాటి వారినే గదా మూఢా నరాధమా అని మాటి మాటికీ తిట్టి పోస్తున్నది భగవద్గీత.

  కాబట్టి మానవుడు మానవుడని పించుకోవాలంటే మనస్సును మంచి మార్గంలో పెట్టుకోవాలి. పురుషుడు పురుషుడని పించుకోవాలంటే పూర్ణత్వం కోస మనవరతం కృషి చేయాలి. అందుకు మూలం శ్రద్ధా గుణమే. శ్రద్ధామయః శ్రద్ధే మానవుడి స్వరూపం. వాణ్ణి తూకం వేస్తే తూగేది వాడిలో ఉన్న శ్రద్ధ ఒక్కటే. మిగతా వేవీ తూకానికి రావు. అంచేత యో యచ్ఛద్ధ స్స ఏవసః వాడికెంత మోతాదులో ఉంటే శ్రద్ధ అనేది . Man is his conviction his ideal his aim of life. అంతకుమించి వాడు లేడు. ఉన్నట్టు కనిపించేది వాడి నీడే వాడు కాదు.

యజంతే సాత్త్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః
ప్రేతాన్ భూత గణాం శ్చాన్యే - యజంతే తామసా జనాః - 4

  శ్రద్ధ అనేది మూడు విధాలని గదా చెప్పాము. అది కూడా ఎవరెవరిలో ఎలాటి శ్రద్ధ ఉన్నదో తెలిసే దెలాగా అని సందేహించ నక్కర లేదు. వాడి

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు