#


Index

శ్రద్ధాత్రయ విభాగ యోగము

నీకు కనపడటం లేదు గదా. ధూమాన్ని బట్టి దాని అస్తిత్వాన్ని ఎలా ఊహించావు. అలాగే వారి వారి ప్రవృత్తిని బట్టే మన మర్ధం చేసుకోగలం మానవులకున్న శ్రద్ధా త్రైవిధ్యాన్ని. శృణు విన్నావు గదా. ఇదీ విషయం. ఇంకా వినవలసిం దొక టుంది. అదీ విన మంటున్నాడు భగవానుడు ఏమిటది.

సత్త్వాను రూపా సర్వస్య - శ్రద్ధా భవతి భారత
శ్రద్ధా మయో _ యం పురుషో - యోయచ్ఛద్ధ స్స ఏవసః - 3

  సత్త్వాను రూపా సర్వస్య శ్రద్ధా భవతి వారి వారి సత్త్వానికి తగినట్టే మానవులందరికీ శ్రద్ధ అనేది ఏర్పడుతుంది. సత్త్వమేమిటి. సత్త్వమంటే ఇక్కడ సత్త్వగుణమని గాదు అర్ధం. గుణమే అయితే ఒక సత్త్వమే ఏమి. రజో గుణమూ గుణమే. తమో గుణమూ గుణమే. అన్నింటిలోనూ ఉంటుంది శ్రద్ధ. అదే చెప్ప బోతాడు గూడా. అలాంటప్పుడు సత్త్వగుణాన్ని ప్రత్యేకించి చెప్పటంలో అర్థం లేదు. కాబట్టి ఇక్కడ గుణం గాదు సత్త్వమంటే. మరేమిటి. విశిష్ట సంస్కారోపేతాంతః కరణమే సత్త్వమని అర్థం వ్రాశారు భగవత్పాదులు. ఆయా భిన్న భిన్న సంస్కారాలతో కూడిన అంతఃకరణం లేదా మనస్సుకే సత్త్వమని పేరు. A mind with diff. impressions. ລ້ ລ້ ລ້ ໔໐໖. అందులో ఎన్నో వాసనలు పోగయి కూడా ఉంటాయి. నిర్వాసనమైన మనస్సెవడికీ లేదు.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు