#


Index

శ్రద్ధాత్రయ విభాగ యోగము

సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి. తదనుగుణంగానే కొందరికి సాత్త్విక స్వభావమైతే మరి కొందరికి రాజస స్వభావమైతే ఇంకా కొందరికి తామస స్వభావం గోచరిస్తుంటుంది. ఆయా స్వభావాలను బట్టి వారికి కలిగే శ్రద్ధలో కూడా తారతమ్యం చూస్తుంటాము. అది వారి చిత్త వృత్తులలో మాటలలో బాహ్యమైన ఆచరణలో బయటపడు తుంటుంది. సాత్త్వికమైన శ్రద్ధ ఉన్నవారు శివ విష్ణ్వాది దేవతలను ధ్యానిస్తుంటారు. పూజిస్తుంటారు. రాజసులైతే యక్ష రక్షస్సుల నారాధిస్తుంటారు. మరి తామసులైతే ప్రేత పిశాచాదుల నారాధిస్తా రంటారు భగవత్పాదులు.

  నన్నడిగితే అది సాంప్రదాయికంగా పేర్కొన్న విషయం. అదే కానక్కర లేదు. శాస్త్రంలో ఆధ్యాత్మ విషయ మెక్కడెక్కడ బోధించారో అది అభ్యసించాలనే జిజ్ఞాస సాత్త్వికం. ఆయా దేవతల నుపాసన చేస్తే ఇహ పరాల్లో అభ్యుదయం సాధించవచ్చు ననే భావం రాజసం. అది కూడా కాక కేవలం పెద్దలంతా చేస్తూ వచ్చారు మనమూ ఆ మార్గంలోనే వెళ్లిపోతే మంచిదని యాంత్రికంగా కర్మకాండ నాచరిస్తూపోయే స్వభావం తామసం. శాస్త్రం చెప్పిన జ్ఞానోపాసనా కర్మకాండలు మూడూ ముగ్గురూ పాటిస్తూ పోవటంలోనే మనం గ్రహించవచ్చు. ఎవరు సాత్త్వికులో ఎవరు రాజసులో ఎవరు తామసులో. కార్యాన్ని బట్టే కారణాన్ని గుర్తించవచ్చు నంటారు శాస్త్రజ్ఞులు. కార్యమే లింగం Indication కారణానికి. లేకుంటే అగ్ని

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు