శ్రద్ధ మూడు విధాలని పేర్కొనటం. మూడింటినీ అలవరుచుకోమని గాదు. అందులో సాత్త్వికమైనదేదో అదే పట్టుకోమని మహర్షి హృదయం.
త్రివిధా భవతి. ఉండటమేమో మూడు విధాలుగా ఉంటుంది శ్రద్ధ
మానవులకు. అందరికీ మూడు ఉంటా యనుకోరాదు మరలా. దేహినాం
సాస్వభావజా. దేహి అంటే దేహం ధరించిన వాడు. దేహమంటేనే
త్రిగుణాత్మకం. చెప్పాము గదా ఇంతకు ముందు. స్థూల దేహం తమో
గుణం. సూక్ష్మ దేహంలో ప్రాణం రజో గుణం. మనస్సు సత్త్వగుణమని.
ఇవి మనకు స్వభావజా. స్వభావం వల్లనే ఏర్పడ్డాయట. స్వభావమంటే
అర్థం చెబుతున్నారు భగవత్పాదులు. జన్మాంతర కృతః ధర్మాధర్మాది సంస్కారః
మరణకాలే అభివ్యక్తః స్వభావః - పూర్వజన్మలలో చేసుకొన్న ధర్మా
ధర్మాదులు సంస్కార రూపంగా ఉండిపోయి అవి మరణ సమయంలో
బయటపడితే దానికి స్వభావమని పేరంటారు. అలాటి స్వభావ మందరికీ
ఒకటి కాదు. వారి వారి సంస్కారాన్ని బట్టి స్వభావ మేర్పడుతుంటుంది.
అది ఇంగువ కట్టిన బట్ట ఆ సంస్కారం. ఇంగువ అంతా ఖర్చయి పోయినా
దాని వాసన పోనట్టే మరణానంతరం కూడా జీవులకది వాసనారూపంగా
ప్రత్యక్ష మవుతుంది.
కనుక దానిలో ఉన్న తారతమ్యాన్ని బట్టే వారి వారి స్వభావాలలో కూడా తరతమ భావం కొట్ట వచ్చినట్టు కనిపిస్తుంటుంది మనకీ జన్మలో.