#


Index

శ్రద్ధాత్రయ విభాగ యోగము

అచేతనమైనా ఏదైనా దాని అధీనంలో ఉండవలసిందే. అది చెప్పినట్టు నడుచుకోవలసిందే. గుణ సాంగత్యం వల్లనే జనన జీవన మరణాలు ప్రాణులకు. అలాంటప్పుడు మనకు కలిగే ఏ భావమైనా గుణాత్మకమేనని వేరుగా చెప్పనక్కర లేదు.

  అయితే అలా గుణాధీన మయినప్పుడిక ఈ శ్రద్ధ అనే భావం కూడా అంతే గదా. ఇక దాని నలవరుచుకోమని చెప్పటంలో అర్థమేముందని సందేహించవచ్చు. నిజమే. కాని ఎక్కడ వ్యాధి ఉందో అక్కడ చికిత్స కూడా ఉంటుంది. ఏ లంకలో రాక్షసులున్నారో ఆ లంకలో ఆ రాక్షసుల మధ్యనే విభీషణుడు కూడా ఉన్నాడు. రాక్షసులలో జన్మించినా రాక్షస స్వభావుడు కాడతడు. అలాగే గుణాలు మూడూ మనలనీ సంసారంలో కట్టి పడేశేవే అయినా సత్త్వ గుణం మాత్రమంత దారుణమైనది గాదు. రజస్తమో మాలిన్యాన్ని బాగా క్షాళితం చేసి దాన్ని శుద్ధి చేసుకోగలిగితే అది శుద్ధసత్త్వంగా మారుతుంది. అప్పుడది గుణమైనా మనకు బాధకం కాదు. మీదు మిక్కిలి జ్ఞాన సాధక మవుతుంది. అది ఎలాగంటే సత్త్వం శుద్ధి అయితే సాత్త్వికమైన శ్రద్ధకది దారితీస్తుంది. దాని వల్ల శ్రవణ మననాదులు చేయాలని బుద్ధి పుడుతుంది. తద్వారా ఆత్మాకారమైన వృత్తి ఉదయిస్తుంది. అది సర్వమూ ఆత్మ స్వరూపమే ననే అపరోక్షాను భవాన్ని మనకందిస్తుంది. అదే మోక్షం జీవితానికి. కాబట్టి ఇంత ఉన్నదిందులో ఆంతర్యం. అందుకే

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు