#


Index

శ్రద్ధాత్రయ విభాగ యోగము

తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉంది మనకు. అది ఇప్పుడు మనకున్నది సాత్త్వికమైనదా. రాజసమా. లేక తామసమా అని అర్జునుడే గాదు మన మందరమూ తెలుసుకోవలసిన విషయమే ఇది. తెలుసుకొని ఏమి ప్రయోజనమని అడుగుతారేమో. కావలసినంత ఉన్నది ప్రయోజనం. అది తామసమైతే దాన్ని రాజసం గానూ రాజసమైతే సాత్త్వికం గానూ మార్చుకొని తద్ద్వారా ఆత్మ జ్ఞానానికి కృషి చేసి మన జీవిత సమస్యను పరిష్కరించుకో వలసి ఉంది మనం. ఇంతకన్నా గొప్ప ప్రయోజనమేమి కావాలి మానవుడికి. కాబట్టి ఇది బాగా వివేచన చేసి గ్రహించవలసిన సాధన రహస్యం. అదే వ్రాస్తున్నారు భగవత్పాదులు. సామాన్య విషయోయం ప్రశ్నః సామాన్యంగా అడిగాడర్జునుడు. నాప్రవిభజ్య ప్రతివచన మర్హతి. ఏది ఏమిటని బాగా దేని పాటికది విశ్లేషణ చేసిగాని సమాధానం చెప్పలే మంటాడాయన. ఆ సమాధానమే వస్తున్నదిప్పుడు వినండి.

త్రివిధా భవతి శ్రద్ధా - దేహినాం సా స్వభావజా
సాత్త్వికీ రాజసీ చైవ - తామసీ చేతి తాం శృణు - 2

  త్రివిధా భవతి శ్రద్ధా. శ్రద్ధ అనేది ఒకటి గాదు. మూడు విధాలది. మూడు గుణాలను బట్టి మూడయింది. గుణాలంటే సత్త్వరజస్త మస్సులు. అవే అటు బ్రహ్మాండాన్ని ఇటు పిండాండాన్ని రాజ్యమేలు తున్నాయి. గుణాత్మకం గాని పదార్ధామే లేదని గదా చెప్పాము. చేతనమైనా

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు