లలో ఏదో ఒక గుణమయి ఉంటుంది. గుణాత్మకం గాని స్థితి అంటూ లేదు మానవులకు. మానవుడొక దేవతను పూజించినా పూజించవచ్చు. ఒక మానవుడితో వ్యవహరించినా వ్యవహరించవచ్చు. ఒక శాస్త్రాన్ని అభ్యసించినా అభ్యసించవచ్చు. ఒక సామాన్యమైన జీవనం సాగించినా సాగించవచ్చు. ఏ పని చేసినా అది గాదు ముఖ్యం. వాడప్పుడే గుణ మవలంబించి ఆ దశలో ఉన్నాడని ప్రశ్న. సత్త్వగుణమా రజోగుణమా. లేక తమో గుణమా. ఈ త్రిగుణాలను విభజిస్తే రజస్తమో గుణాలు అసుర సంపద సత్త్వ గుణమొక్కటీ దైవ సంపద. ఏ దశనూ వదలి పెట్టవీ గుణాలు.
కాగా రెండింటికీ శ్రద్ధ అనేది మాత్రముండాలి మానవుడికి. గుణాలు మనలను వదలిపెట్టనట్టే మనం శ్రద్దను వదలి పెట్టరాదు. అది రోగమైతే ఇది దానికి చికిత్స. అసుర సంపదను వదిలేయటానికీ శ్రద్ధే. దైవసంపద వలవరుచుకోటానికే శ్రద్ధే కావలసి ఉంది. శ్రద్ధ లేకుంటే అది వదిలేయలేము. ఇది అభ్యసించలేము. అసుర సంపదను వదిలేసి దైవసంపదను శ్రద్ధతో అభ్యసిస్తేనే ఎప్పటికైనా బ్రహ్మజ్ఞానానికి నోచుకొంటాడు మానవుడు. అప్పుడు వాడికి తన జన్మ స్థితీ మరణ స్థితీ రెండూ కనపడవు. రెండింటినీ కబళించి వాడి జ్ఞానం అనంతమైన బాహ్మీ స్థితిగా దర్శనమిస్తుంది. ఇదంతా శ్రద్ధా మాహాత్మ్యమే. ఇప్పుడీ శ్రద్ద ఎవడి కెంత మోతాదులో ఉందో