#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

కవి. అది నిరీశ్వరమే గాని సేశ్వరం కాదు. మరి భగవంతుడి కధ గదా భాగవతం. అందులో నిరీశ్వరవాద మెలా చోటు చేసుకొన్నది. కనుకనే భాగవతాన్ని భాష్యకారులు వ్యాసప్రోక్తంగా భావించరు. ఆస్తా మేషా ప్రాసంగికీ కధా - ప్రకృత మను సరామః

మహాభూతాన్యహంకారో - బుద్ధి రవ్యక్త మేవచ
ఇంద్రియాణి ద శైకంచ పంచ చేంద్రియ గోచరాః - 5

ఇచ్ఛా ద్వేష స్సుఖం దుఃఖం - సంఘాత శ్చేతనా ధృతిః
ఏతత్ క్షేత్రం సమాసేన - సవికార ముదాహృతమ్ - 6

  క్షేత్రమంటే ఏమిటి ఎలాంటిది ఎంత ఉంది దాని పరిధి అని గదా ప్రశ్న. దానికి జవాబిస్తున్నాడు మహర్షి. మహాభూతాని. ఇక్కడ భూతాలంటే స్థూలమైన పృధివ్యాదులు గావు. సూక్ష్మమైన వాటి తన్మాత్రలు. స్థూలమైనవేవో తరువాత ఇంద్రియ గోచరాః అనే మాటతో చెప్పబోతాడు. సూక్ష్మమింద్రియ గోచరం కాదు. అది స్థూలమైతేనే గోచరమవుతుంది. సూక్ష్మమే స్థూలానికి కారణం. స్థూలం దానికి కార్యం. కారణం ప్రకారమైతే Origin కార్యం. వికారం Change. అహంకార ఇది మహాభూత కారణం. పోతే అహంకార కారణం బుద్ధి. బుద్ధి అంటే నిశ్చయాత్మకమైన అంతః కరణం. దానికి కారణ మవ్యక్తం. వ్యక్తం కానిదేదో అది అవ్యక్తం. అవ్యాకృతమని Unformed or unmanifest కూడా అంటారు. ఏదో గాదది. ఈశ్వరుడి మాయా శక్తి. ఇందులో మహాభూతా లయిదూ అవ్యక్త మహ దహంకారాలు మూడూ వెరసి ఎనిమిది. ఇదే అష్టధా భిన్నమని భగవానుడింతకు ముందు పేర్కొన్న అపరా ప్రకృతి.