#


Index

శ్రద్ధాత్రయ విభాగ యోగము

అన్నిటికీ స్వస్తి చెప్పి తన ఇష్టానుసారం ప్రవర్తించినట్టవు తుంది. కాని శ్రద్ధయా న్వితాః అని చెబుతున్నది గీత. శ్రద్ధ మాత్రం వదిలేయటానికి లేదు. అది ఉండి తీరాలని నియమం పెట్టటం వల్ల శాస్త్రాన్ని వదిలేసినా దాన్ని మాత్రమలా వదిలేయగూడదని మహర్షి హృదయం. స్వతంత్రంగా గ్రహించలేక పోయినా పెద్దలను చూచి అయినా గ్రహించవచ్చు గదా. దానిలో నైనా శ్రద్ధాభక్తులుండ వచ్చుగదా. అది కూడా మానేసి విశృంఖలంగా వ్యవహరిస్తే ఎలాగ. అలా వ్యవహరిస్తే పశుప్రాయంగా బ్రతికేవాడికీ ఈ సాధకుడికీ తేడా ఏముంది. కనుక శాస్త్రజ్ఞానం లేకపోయినా శ్రద్ధ ఉండవలసిందే తప్పదు.

  అలాటి శ్రద్ధతో యజంతే. యజనం చేస్తుంటారు. యజనమే యజ్ఞం. యజనమంటే జ్యోతిష్టా మాదులూ వాజపేయాదులైన కామ్యకర్మలే కానక్కర లేదు. నిత్యమూ చేసే పంచ యజ్ఞాలైనా కావచ్చు. దేవ ఋషి మనుష్య భూత స్వాధ్యాయాలు అందరూ చేయగలిగిన యజ్ఞాలు. అంతేకాదు. ఒకానొక సంకేతార్థంలోనే చెప్పనక్కర లేదు యజ్ఞమనే శబ్దాని కర్థం. ఇంతకు పూర్వ మధ్యాయాంతంలో ఏమన్నాడు. శాస్త్ర విధానోక్తం కర్మ కర్తు మిహార్హసి అని గదా అన్నాడు. అక్కడ యజ్ఞమనే మాట లేదు. దానికి బదులు కర్మ అని మాత్రమే ఉన్నది. దానికి మారుగా ఇక్కడ అధ్యాయారంభంలో యజ్ఞ మనే మాట ప్రయోగించాడు. దీన్నిబట్టి

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు