జీవితంలో. కాబట్టి జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తు మిహార్హసి. అలాటి శాస్త్రమేది నీకు చేయమని విధించిందో దాన్ని నీవు బాగా అర్థం చేసుకొని ఏ పని చేసినా చేయవలసి ఉందని బోధించాడాయన. పోతే ప్రస్తుత మలాటి శాస్త్రాధ్యయనమూ దాని వాసనా ఏమాత్రమూ లేని పామరుల సంగతేమిటి వారికి ఫలితముందా అని ప్రశ్న వస్తే దానికి సంజాయిషీ ఇస్తున్నాడు.
యే శాస్త్రవిధి ముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః
తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్త్వమాహో రజస్తమః -1
యే శాస్త్ర విధి ముత్సృజ్య య జంతే. శాస్త్రమంటే శ్రుతి స్మృతి రెండూ శాస్త్రాలే. మానవుడికి ఏది చేయాలో చేయరాదో శాసించి చెప్పేవే. అదే ప్రమాణం. మార్గదర్శకం మానవుడికి. అలాటి శాస్త్రం విధించిన మార్గాన్ని వదిలేసి యజనం చేస్తున్నారు మామూలు మానవులు. వారికి శాస్త్రం చదివి అర్థం చేసుకొనే జ్ఞానం లేదు. దాని జ్ఞానమున్న వారెవరైనా చదివి చెబితే వినవలసిన వారే. వారే మార్గంలో వ్యవహరిస్తున్నారో కనీస మా వ్యవహారాన్ని చూచి అయినా గ్రహించవలసిన వారే. అందుకే అంటున్నారు భాష్యకారులు వృద్ధ వ్యవహార దర్శనా దేవ. పెద్దల నడవడి చూడటం వల్లనని. అలాటిది చూచి తెలుసుకొని ఆ మార్గంలోనే తామూ నడుచుకోవాలనే శ్రద్ధ మాత్రముండాలి వారికి. అది కూడా లేకుండా శాస్త్ర విధానాన్ని వదిలేస్తే మాత్రం పొరబాటు. అప్పుడే ఆలంబనమూ లేక