ప్రస్తుతమీ భగవద్గీత శ్రద్ధను గురించి చెబుతున్నదంటే అది ఈ
అధ్యాయానికి మాత్రమే నియంత్రితమని భావించరాదు సాధకుడు.
సాంఖ్యం మొదలు కొని మోక్ష సన్న్యాస యోగం వరకూ ఉంది దాని
క్షేత్రం. ఎంచేతనంటే భగవద్గీత మనకేమి బోధించటానికి వచ్చిందసలు.
ఆత్మ జ్ఞానమే గదా. దాన్ని సంపాదిస్తేనే గదా విషాదమనే సమస్యను
పరిష్కరించుకొని బయట పడతాము. కర్మ భక్తి సమాధి యోగాలెన్ని
చెప్పినా ఆ జ్ఞానానికీ తద్ద్వారా మోక్షానికే గదా చెప్పింది. సర్వం కర్మాఖిలం
జ్ఞానే పరి సమాప్యతే. జ్ఞానం లబ్ధ్యాపరాం శాంతిం. ఇంతేగదా గీతోపదేశం.
మరి అలాంటి జ్ఞానమెలా లభిస్తుందని చెప్పింది గీత. శ్రద్ధావాన్ లభతే.
శ్రద్ధ ఉంటేనే లభిస్తుంది గాని అది లేకుంటే జ్ఞానమనేది ఆసించలేవు
పొమ్మంటున్నది. అలాంటప్పుడు సాధన మార్గమంతా ఆద్యం తాలూ
రాజ్యం చేస్త్ను దేదంటావు. శ్రద్ధ తప్ప విడిచి మరొక మాటే లేదు. అది
వ్యంగ్యంగా సర్వత్రా వాచ్యంగా అక్కడక్కడా బయట పెడుతూనే ఉన్నది.
పోతే ఇప్పుడు దాని స్వరూప ప్రయోజనాలేమిటో సవిస్తరంగా
నిరూపించటాని కొక అధ్యాయమే ప్రత్యేకించి వ్రాస్తున్నాడు
వ్యాసభగవానుడు. ఇంతకు ముందుగానే జరిగిపోయిన అధ్యాయం చివరి
శ్లోకంతో ముడిపెట్టి ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నా డాయన.
ఇంతకు పూర్వమేమి చెప్పాడు మహర్షి. ఏది నీకు కర్తవ్యమో ఏది కాదో నిర్ణయించి నీకు బోధించవలసింది శాస్త్రం. అదే నీకు ప్రమాణం