జనమే జయుడి తమ్ములు కోపంతో చావగొట్టారు. అది ఏడుస్తూ పోయి తల్లితో మొరబెడుతుంది. అది దేవశుని ఆతల్లి. దేవలోకానికి చెందినది. వెంటనే అది జనమే జయుడి దగ్గరికి వచ్చి నీ తమ్ములు నిష్కారణంగా నా కుర్రవాణ్ణి కర్రతో మోది పంపించారు. ఇలాటి అధర్మాని కొడి గట్టినందుకు మీ వంశానికి మంచి జరగదు పొమ్మని శాపమిచ్చి వెళ్లిపోతుంది. ఇది భారత కధారంభమైతే కధాంతమిక ఎలాంటిదో తెలుసు గదా మీకు. ధర్మరాజు తన వాళ్లనందరినీ పొగొట్టుకొని ఒంటరిగా మహా ప్రస్థానం చేస్తుంటే అతని వెంట వచ్చిందేది. శునకమే గదా. దేవతలు విమానం పంపితే ముందా శునకాన్ని ఎక్కించి గాని నేనెక్కనని కూడా పంతగించాడా మానవుడు. అప్పుడదే యమధర్మరాజు రూపంలో ఆయనకు దర్శనమిస్తుంది.
ఏమిటీ రెండుదంతాలనూ కలుపుకొని చూస్తే మనకు తెలిసే రహస్యం. శ్రద్ధ లేకుంటే నీవెంత దీర్ఘకాలం జీవించినా ఎన్ని ధర్మకార్యాలు చేసినా అది నిష్ఫలమని ఒకటి. అది ఏమరకుండా పాటిస్తే ఏది నీకు దక్కకుండా పోయినా చివరకు జీవిత ఫలమేదో దాన్ని తప్పకుండా చవిచూడ గలవనేది మరొకటి. శునక మనేది శ్రద్దకూ విశ్వాసానికీ కేవల మొక సంకేతం మాత్రమే. అదే మహర్షి హృదయం. ఉపనిషత్సారమే గదా భారతం. ఉపనిషత్తస లేమి చెబుతున్నది. శ్రద్ధత్స్వ అని బోధిస్తున్నది మనకు. ఏవిషయంలోనైనా సరే శ్రద్ద పెట్టుకొని ముందుకు సాగిపోండి.