#


Index

శ్రద్ధాత్రయ విభాగ యోగము

సంపాదించ గల మనేనా చేస్తుంటాము. ఒక వ్యవసాయం చేస్తే ఫలసాయ మంటుదని గారంటీ ఉంటేనేనా సాగిస్తుంటాము. కర్మణ్యే వ్యాధి కారః అని గీత చెప్పినట్టు ఫలితముంటుందనే నమ్మకంతోనే గదా ఆయా పనులు పెట్టుకొని జీవిస్తుంటాడు మానవుడు. అలా నమ్మకం పెట్టుకోక పోతే ఏ ప్రయత్నమూ చేయలేము. ఏ ఫలితమూ చూడలేము. ఫలితముంటుందో లేదోనని ముందుగానే బేజారయిపోతే అసలే ప్రయత్నమూ చేయలేడు మానవుడు. అదే శ్రద్ధ అంటే. నమ్మకం విశ్వాసం పట్టుదల దీక్ష అని అర్థం.

  మామూలు లౌకిక విషయాలలోనే ఇలా ఉంటే ఇక పార లౌకికమైన ధర్మ మోక్ష పురుషార్థాలలో ఎంతగా ఉండాలో గమనించండి. మనకెప్పుడూ దృష్టం కాదు గదా అని ఉపేక్షించరాదది. దృష్టం కాదు గనుకనే ఎప్పటికైనా దృష్టమవుతుందనే నమ్మకంతో సాధించి అనుభవానికి తెచ్చుకోవాలది. అందులోనూ ధర్మ పురుషార్ధమైనా సాధ్యం. మోక్ష పురుషార్ధమలా కాదు అది సిద్ధం. నీవు ప్రయత్నించినా ప్రయత్నించక పోయినా ఉందది. దానిపాటికది ఎప్పుడూ ఉంది. కనుక మందమధ్య మాధికారివైతే సందేహించకుండా ధర్మాన్నైనా పట్టుకొని పోవాలి. ఉత్తమాధికారివే అయితే జ్ఞానమైనా సంపాదించాలి. అలా కాకుంటే శాస్త్రం బోధించే కర్మ కాండకూ జ్ఞాన కాండకూ రెండింటికీ అసలర్ధం లేకపోతుంది. అర్థకామాలతో పాటు చివరకు ధర్మాన్నైనా కాదని త్రోసి వేయవచ్చు గాని

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు