#


Index

దైవాసుర సంపద్విభాగ యోగము

  కాబట్టి మానవుడు తనకు శ్రేయఃకరమైన శ్రవణ మనన నిది ధ్యాసనలనే మూడింటినీ సాధన చేస్తూ పోతే తతోయాంతి పరాంగతిం. ఎప్పటికైనా సర్వోత్కృష్టమైన స్థానం చేరి తరించగలడు. పరాగతి అంటే మోక్షమే. గతి గాని గతి అది. గతి అంటే గమనమని చలనమనీ భావించరాదు. ప్రాప్తికే గతి అని పేరు. ప్రాప్తి కూడా కొత్తగా ప్రాప్తించేది గాదు. బ్రహ్మమనేది సర్వత్రా ఉంది. సర్వదా ఉంది. అదే మోక్షమనేది కూడా. అలాంటప్పుడు పొందటమేమిటి. పొందే ఉన్నామని మరలా గుర్తించటమే పొందటం. దీనికే ప్రత్యభిజ్ఞ Realisation అని అద్వైతులు పెట్టిన అద్భుతమైన పేరు. కాబట్టి ఇంతకూ మూడు భూమికలిది. ఒకటి అసుర సంపద నుంచి బయట పడటం. రెండు దైవ సంపద నలవరుచుకోటం. మూడు దాని బలంతో ఆత్మజ్ఞాన సాధన చేస్తూ పోవటం. చేస్తే ఇక సిద్ధి అనేది గారంటీ.

  పోతే ప్రస్తుత మీ అసుర గుణాలను పరిహరించటానికి గాని శ్రేయోమార్గంలో చరించటానికి గాని మానవుడికి మార్గదర్శకమేదో చెబుతున్నది గీత. ఏదో గాదది. శాస్త్రం. దేనికైనా ఒక ప్రమాణమనే దుండాలి. ప్రమాణమెప్పుడూ మనకు శాస్త్రమే. శాసించి చెప్పేదేదో అది శాస్త్రం. అది లేకుంటే ఏది తనకు మంచో ఏది చెడో తెలియదు మానవుడికి. శాస్త్ర సాహాయ్యం లేనంత వరకూ మంచే చెడ్డగా చెడ్డే మంచిగా కనిపించినా

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు