సంకేతం. ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థాః అనే శ్లోకంలో ఇదే తార్కాణ మవుతుంది మనకు. గుణా నేతా న తీత్యత్రీన్ అన్నారంటే ఈ మూడు ప్రాకృత గుణాలనూ దాటి పోవాలని అర్థం.
అందుకే బృహదారణ్యకంలో బ్రహ్మ దేవుడు దదద అని మూడు మార్లు దకార ముపదేశించాడు దేవ మానవ దానవులను ముగ్గురినీ ఉద్దేశించి. అవి ఏవో గావు. ఒకటి దమం. ఒకటి దానం. మరొకటి దయ. దమాదులకు సంకేతమే అవి. ఈ దైవ గుణా లలవరుచు కొంటే చాలు. ఆ అసుర గుణాలకివే జవాబు చెబుతాయి. అప్పుడు క్రమంగా త్రిగుణాలను దాటిపోయి గుణాతీతమైన బ్రహ్మ పదాన్ని అందుకోగలరని మానవులకే చేశాడు బ్రహ్మ దేవుడీ ఉపదేశం. అదే వర్షర్తువులో దదద అని మేఘం చేసే గర్జన ద్వారా ఆ పితామహుడే మానవుల కప్పుడప్పుడు గుర్తు చేస్తున్నాడని కూడా ఉందా ఉపనిషత్తులో. ఏమిటీ కధ. కధంతా ఒక గొప్ప సంకేతం. సంకేత మెప్పుడూ ఒక సత్యాన్ని చెప్పటానికే వస్తుంది. అదేదో గాదు. ఈ అసుర గుణాలు వదిలేసి దైవ గుణాలల వరుచుకోమని బోధించటమే. అందుకే తస్మా దేతత్రయ మని గట్టిగా బోధిస్తున్నారు.
ఏతై ర్విముక్తః కౌంతేయ తమో ద్వారైస్త్రిభి ర్నరః
ఆచరత్యాత్మనః శ్రేయః - తతో యాతి పరాంగతిమ్ -22
ఏతైర్విముక్తః తమోద్వారైస్త్రి భిర్నరః - నరుడైన వాడు నారాయణ పదవి నందు కోవాలంటే షరతేమిటో తెలుసా. మొట్టమొదట ఈ మూడు