వలసిందే. అందుకే నాశన మాత్మనః అని చాటటం ఆత్మ నాశం గాక అది లాభమెలా అవుతుంది. బ్రహ్మజ్ఞానానికే ఆస్కారం లేదు గదా. అంచేత ఇవి నరక ద్వారాలు మన ఆత్మ వినాశానికే దారి తీసే అనర్థాలని తెలుసుకోవాలి మొదట మానవుడు.
ఇంతకూ ఏమిటా ద్వారాలు. కామః క్రోధ స్త థా లోభః - కామ మొకటి క్రోధ మొకటి - లోభమొకటి - ఇందులో కామం దేవతలకూ క్రోధం మానవులకూ లోభం మానవులకూ విశేష లక్షణాలని చెప్పారు శాస్త్రంలో. ఎక్కడో లేరా దేవ దానవులు మరలా. మానవ జాతిలోనే ఉన్నారా ముగ్గురూ. కామోద్రేకంతో మానవులే దేవత లవుతారు. భోగలాలసులయి కాలం గడుపుతుంటారు. క్రోధావేశ మెక్కువయితే దానవులయి ప్రవర్తిస్తారు. రెండూ గాక లోభ గుణ మెక్కువయితే పూచిక పుల్ల పోనీయకుండా పోగు చేసుకొనే మర్త్య స్వభావంతో బ్రతుకుతుంటారు. కాబట్టి ఈ మూడు దోషాలు గుర్తించి మానవులే వివేక బుద్ధితో వీటినదుపులో పెట్టుకొంటే దానవుల స్థాయి నుంచి మానవుల స్థాయికీ మానవుల స్థాయి నుంచి దేవతల స్థాయికీ ఎదిగి చివరకు దాన్ని కూడా వదిలేసి దాని కతీతమైన గుణాతీత స్థాయినందుకో గలరు. ఇవే ప్రకృతి గుణాలసలు. సత్త్వగుణం కామం. రజో గుణం లోభం. తమో గుణం క్రోధం. ఇవి మూడే మూడు జాతులూ మూడు లోకాలూ అని