పేర్కొంటున్నాడు. ఈ మూడింటిలో అసుర సంపద అంతా ఎంత విస్తారంగా చెప్పినా ఇమిడి పోతుంది. ఇవి మూడూ మానవుడిని జన్మ జన్మలూ తరుముకొని వచ్చే మూడు దయ్యాలు. ఇవే అన్ని అనర్థాలకూ మూలం. వీటిని ప్రయత్నపూర్వకంగా పోగొట్టుకో గలిగితే సంసార బంధమే పోగొట్టుకొని బయటపడ్డ వాళ్ళమవుతాము. అదేమిటో ఇప్పుడు బయట పెడుతున్నాడు వ్యాసభట్టారకుడు.
త్రివిధం నరక స్యేదం - ద్వారం నాశన మాత్మనః
కామః క్రోధ స్తధా లోభః - తస్మా దేతత్తయంత్యజేత్ - 21
త్రివిధం నరక స్వేదం ద్వారం మూడే ఉన్నాయి నరకానికి ద్వారాలు. నాశనమాత్మనః - వాటిలో ప్రవేశించట మేమిటి సర్వ నాశనమయి పోవటమేమిటి మానవుడు. నశించటమంటే పురుషార్ధానికి యోగ్యత లేకుండా పోతాడని పేర్కొంటారు భాష్యకారులు. ధర్మానికి గాని మోక్షానికి గాని నోచుకోక పాడయి పోవటమే నాశనమనే మాటకర్థం. ధర్మమైతే స్వర్గానికైనా తీసుకెళ్లుతుంది. మోక్షమైతే ఇక చెప్పనక్కర లేదు. పునరావృత్తే లేకుండా బ్రహ్మసాయుజ్యాన్నే అందిస్తుంది. అవి రెండూ లేకుంటే ఇక మిగిలింది మానవుడికి నరకమే. అందులో నానాయాతనలూ అనుభవించి మరలా కర్మశేష మనుభవించటానికి వచ్చి ఈ కర్మ భూమి మీద పడవలసిందే. చేసిన పాపకర్మకు తగినట్టు ఏ పశుమృగాది జన్మలో ఎత్త