#


Index

దైవాసుర సంపద్విభాగ యోగము

డీశ్వరుడు. ఆయన సృష్టి న్యాయ సమ్మతమని పించుకోలేదు. అంతవరకూ మాత్రం జన్మ లెత్త వలసిందే తప్పదు. కారణమొక్కటే. మామ ప్రాప్యైవ. నన్ను పొందే మార్గమే లేదంటాడీశ్వరుడు. అందుకే తతోయాంత్య ధమాం గతం. అంతకంత కధమా ధమమైన క్రిమి కీట తరుగుల్మాది జన్మలింకా ఎన్ని ఉన్నాయో అన్నీ ఎత్తవలసి వస్తుంది.

  ఇక్కడ మామ ప్రాప్య అంటే నన్ను పొందకుండా అని అర్థం వ్రాయలేదు భగవత్పాదులు. ఎందుకంటే ఈశ్వరుణ్ణి పొందగలిగితే ఇక అధమమైన గతి వాడికి ప్రాప్తిస్తుందని చెప్పనే అక్కర లేదు. అలాటి ఆ శంక చేయనే చేయడెవ్వడూ. మరేమిటంటారు. మచ్ఛిష్ట సాధు మార్గమప్రాప్య. నేను బోధించిన మంచి మార్గమేదైతే ఉందో దాని ఆజ్ఞను పాటించక అని వ్రాస్తారాయన. ఏమిటా మార్గమంటే అధ్యాత్మ శాస్త్రం. అది బోధించిన మార్గంలో నడుచుకొంటే ఈశ్వర సాయుజ్యమదే ໖. Means determines the end . శాస్త్రోపదేశం ద్వారానే పరమాత్మను పట్టుకోవాలి. సాధనం లేకుండా గమ్యమెలా చేరగలం. అలాటి సాధనం మానవ జన్మలోనే పట్టుకోవాలి ఎవడైనా. వదిలేశామంటే పశుమృగాది జన్మలే ప్రాప్తిస్తాయి. అప్పుడవ కాశం లేదు మనకు. ఇదీ ఇందులో ఉన్న రహస్యం.

  ఇంతవరకూ అసుర సంపద అంటే ఏమిటో సవిస్తరంగా ఏకరువు పెట్టి గీతాకారుడిప్పుడు దాన్నే మరలా మూడు మాటల్లో సంక్షిప్తంగా

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు