చూస్తూనే ఉన్నాము. ఇవన్నీ మనకిలా కనపడుతున్నాయంటే పరమాత్మ వీటి ద్వారా మనకు గుర్తు చేస్తున్నాడు. చేసిన పాపకార్యాలు వృధా పోవు. ఇలాటి దారుణమైన ఫలితమిచ్చి తీరుతాయని. లేకుంటే ఈ సృష్టి ఇంత విషమంగా విషాదకరంగా ఎందుకేర్పడు తుందని మనకా ఈశ్వరుడు చేసే పెద్ద హెచ్చరిక ఇది.
ఆసురీం యెని మాపన్నా- మూఢా జన్మని జన్మని
మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధ మాంగతిమ్ - 20
అంతేకాదు. ఒక జన్మ ఎత్తి తీర్చుకొనేది కాదీ ఋణం. ఆసురీం యోని మా పన్నాః - అసుర యోనులలో జన్మించి అందులోనే మరణించినా మూఢా జన్మని జన్మని. అప్పటికీ జ్ఞానమనేది ఉదయించదు వారికి. ఇంకా మూఢులే. అవివేకులే. ఎందుకంటే కర్మ జీవులే గాని బుద్ధి జీవులు కావవి. కర్మఫల మనుభవించటానికే జన్మించాయి. సత్కర్మ చేసుకొని మరలా తరించటానికి కాదు. అలాటి అవకాశమే లేదు వాటికి. అంచేత జన్మని జన్మని. ఎన్ని జన్మలైనా అలా ఎత్తుతూ పోవలసిందే. తప్పదు. మరి ఇలా జనన మరణాలను భవిస్తూ పోవటమే అయితే వాటికెప్పుడిక మోక్షం. చేసిన పాప కర్మ ఫలమంతా తీరిపోతే ఆ తరువాత మరలా అవి మానవ జన్మ ఎత్తి సత్కర్మాచరణతో అంతకంతకు జ్ఞానం సంపాదించి తరించ గలవు. అలాటి అవకాశమే లేకపోతే నిరంకుశుడని పించుకొంటా