అహంకార బలదర్పాదులైన అవలక్షణాలతో కూడిన వారందరూ నరులు కారు. నరాధములు. నరజన్మ నెత్తి కూడా మృగాల కంటే నీచంగా ప్రవర్తిస్తున్నారు. వారిని నేను శిక్షించకుండా ఉపేక్షించే ప్రశ్నే లేదు. అది వారికిప్పుడే తెలియదు. ముందుగా తెలియదు. తెలియకుండా సమయం చూచి దెబ్బతీస్తాను నేనే వారిని. ఏమి తీస్తారెలా చేస్తారని అడిగితే చెబుతున్నాడు. ద్విషతః క్రూరాన్. నన్నే ద్వేషించే క్రూరస్వభావులు గదా వారు. అలాంటి వారందరినీ నేనేమి చేస్తానో తెలుసా. క్షిపామి. పారేస్తాను. ఎక్కడ. ఆసురీష్వేవ యోనిషు. అసుర యోనులలో.
అంటే అప్పటికి మరలా జన్మ ఉందన్న మాట మానవులకు. ఈ జన్మతోనే తీరిపోతుందను కొంటున్నాము. అది వట్టిది. మరొక జన్మ కూడా ఉంది మనకు. ఒకటి గాదు. అనేకం. కారణం చేసింది మంచైనా చెడైనా ఎక్కడికీ పోదది. తదను గుణమైన ఫలితమిచ్చి తీరుతుంది. . Action Produces క్రియకు ప్రతి క్రియ ఏర్పడకుండా Reaction. ఇది ఆనాటి శాస్త్రమే కాదు. ఈనాటి భౌతిక శాస్త్రం కూడా చెప్పేమాట. అది ఇప్పుడు మనకు శాస్త్ర ప్రమాణమే గాదు. ప్రత్యక్ష ప్రమాణమే ఋజువు చేస్తున్నది. వ్యాఘ్ర సింహాది యోనిషు అని వ్రాస్తున్నారు భగవత్పాదులు. అడవుల్లో బ్రతికే క్రూరమృగాలూ పట్టణాల్లో మనమధ్య బ్రతికే పశుపక్ష్యాదులూ ఎన్నో ఉన్నాయి ప్రాణులు. నిత్యమూ మనం