అయితే వారిలా తమ కెదురు లేకుండా తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ తాము చేసే పనుల కెలాటి శిక్షా లేకుండా బ్రతికిపోవటమేనా లేక ఏదైనా శిక్ష అనేదుంటుందా. మరి అతీతమైన శక్తి ఒకటుందన్నారు మీరది వీరి నెలా ఉపేక్షిస్తూ ఉంది. అలా ఉపేక్షిస్తే ఇక దాని ప్రయోజన మేముందని ప్రశ్న వస్తుంది. దానికిప్పుడు సమాధాన మిస్తున్నాడు గీతాచార్యుడు.
చేసిన పని మంచిదైనా చెడ్డదైనా ఎక్కడికీ పోదు. తగిన ఫలితమిచ్చి తీరుతుంది. అది ఎలాటి ఫలితమైనా మానవుడను భవించి తీరవలసిందే తప్పదు. అయితే అది వెంటనే కలుగుతుందా కాలాంతరంలోనా అని అడిగితే అది మనం నిర్ణయించేది గాదు. కారణం మన బుద్ధులు దేశకాలాల కధీనమైనవీ సంకుచితమైనవీ. అవి సృష్టి రహస్యా న్నంతటినీ భేదించి పట్టు కొనేటంత విశాలమైనవి కావు. అల్పజ్ఞుడైన మానవుడికి సర్వజ్ఞుడైన ఈశ్వరుడి ప్రణాళిక ఎలా ఆకళింతకు రాగలదు. సముద్రంలో ముంచినా ఏ పాత్ర కెంత పరిమాణమో అంతే వస్తుంది దానిలోకి జలం. అంతా రావాలంటే అవుతుందా. అలా రావాలంటే సముద్రమంత పాత్ర కావాలి. అలాగే ఈశ్వర సంకల్ప మర్ధం కావాలంటే ఈశ్వరుడి స్థాయి కెదిగి చూడాలి మానవుడి బుద్ధి. అప్పుడు వాడు మానవుడు కాడీశ్వరుడే.
అంచేత మానవమాత్రులమైన మనకర్థం గాని ఒక దైవ రహస్యం బయట పెడుతున్నాడు ఆ ఈశ్వరుడే స్వయంగా వినండి అలాంటి