గాదు. బ్రతికుండగానే నరక బాధలను భవించినా ఆశ్చర్యం లేదు. మాకేమి మేము ధనవంతులంగదా. ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్లంగదా. మందీ మార్బలముంది గదా మాకేమి భయమంటారా. ఆ ధనమే దివాలా తీయిస్తుంది. ఆ పదవులే పడగొట్టవచ్చు. ఆ మందీ మార్బలమే ఎప్పుడో నీకు ద్రోహం తలపెట్టవచ్చు. అన్నీ ఉన్నా ఎప్పుడో రోగాలూ రొష్టులూ సంక్రమించి శుష్కించి పోయినా పోవచ్చు. ఎప్పుడేది జరగగూడదు. జరగదని నీవు గారంటీ ఇవ్వగలవా. తానొకటి తలిస్తే దైవ మొకటి తలుస్తుందనే మాట ఊరక పుట్టిందా. అలా ఎంతమంది అహంకరించి చివర ఎన్నెన్ని దెబ్బలు తినలేదు. నడమంతరంగానే నశించి పోలేదు. ఆనాటి దుర్యోధనాదులే గాదు. ఈనాటి రాజకీయ నాయకులు మాత్రం తక్కువా. నెపోలియన్ హిట్లరు హుసేన్ల లాంటి వాళ్లెందరో మధ్యలో మటుమాయమై పోయిన వారే. ఎప్పటికప్పుడేమి జరుగుతుందో తెలుసుకోలేక దైవ మజ్ఞాత హస్తంతో కొట్టే కొరడా దెబ్బలకు తట్టుకో లేక పూర్ణాహుతి అయిపోయినవారే. పోతున్నవారే. ప్రత్యక్షంగా నలుగురికీ తెలిసిన సత్యానికి వేరే ప్రమాణం దేనికి. నహి దృష్టే అనుపన్నం నామ అని భగవత్పాదులు చెప్పినట్టు ఒక పక్క దృష్టమవుతున్న విషయానికి హేతువాదం చేసి సమర్ధించటం దేనికి. తెలిసినదే చెప్పుకోటం దేనికంటే ఛీ ఇదా ఈ మానవుల బతుకని రోత పుట్టటానికి. ఇలాటి వైరాగ్య భావం