#


Index

దైవాసుర సంపద్విభాగ యోగము

ఎగిరిందో పంజరం టాపు తగిలి మరలా క్రింద పడవలసిందే. అలాగే మానవుడి బుద్ధి అదీ ఇదీ ఆలోచించి ఆ పని చేద్దామీ పని చేద్దామని ఎంత ముందుకు సాగినా ఎంతో దూరం సాగలేదది. రబ్బరు లాగా ఎంత సాగినా మరీ సాగితే తెగిపోక తప్పదు. అంటే అంతా తనదేనని అన్నీ పోగు చేసుకోవాలనీ అంతా తానే అనుభవించాలనీ ఎంత ఆశపడ్డా అంతవరకే. అంతకు మించి ఏముందో తెలియదు. ఏమవుతుందో తెలియదు. చాలా కాలం కలిసి వచ్చినట్టు కనిపించినా చివరకు తనకే గతి పడుతుందో ఎలాటి దురవస్థ పాలవుతాడో ఏ మాత్రమూ అంతు పట్టేది కాదు. సర్వజ్ఞుడు కాడు గదా తాను. సర్వజ్ఞుడూ కాడు. సర్వ శక్తుడూ కాడు. అవన్నీ తనకున్నట్టు కేవలం అపోహ పడ్డాడు. అలాగే జీవితం సాగించాడు. మరి దాని పరిణామమే మిటో ఎలా అంచనా వేయగలడు. అది తన శక్తికి మించిన వ్యవహారం. బుద్ధి తంత్రం కాదది. వస్తు తంత్రం. అంటే మానవాధీనం కాదు. దైవాధీనమని భావం.

  అదేమి చేస్తుంది. ఇచ్చినంత కాలమిస్తుంది వీడి కవకాశం. సాగినంత కాలం సాగిస్తుంది. చివరకు చెప్పాము గదా వీడి కేమాత్రమూ అంతుపట్టకుండా తీసుకుపోయి పారేస్తుంది. ఎక్కడ. నరకే శుచౌ. ఘోరమైన నరక పంకమున బడున్ అన్నట్టు రౌరవాది నరకాలలో పారేస్తుంది. ఎప్పుడో చచ్చిన తరువాతే గదా అంటారేమో. చచ్చిన తరువాతే

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు