విభ్రాంతా అంటే విభ్రాంతులే మరి. విభ్రాంతులెలా అవుతారు. దీనికి కారణ మేమంటారు. అనాది కాలం నుంచీ వీరికొక పిశాచి అదే మోహం. మోహినీ పిశాచి అంటే ఇదే. మోహజాల సమావృతాః ఇది ఒక జాలం. వల. ఎంత తెంచబోయినా తెగదీ వల. అంత దృఢమైనది. స్థిరమైనది. వలలో పులుగులలాగా తగులుకొన్నారీ మానవులు. అది ఎంతగా వీరి నావరించి ఉన్నదంటే ఎంత ప్రయత్నించినా అందులో నుంచి బయటపడే అవకాశమే లేదు. ప్రయత్న మంటున్నాము. అది కూడా పొరబాటే. అసలు ప్రయత్నమనేది ఉంటే గదా వీరికి. వారికి చుట్టుకొన్న మోహమనండి. విభ్రాంతి అనండి. అది వీరి కా ప్రయత్నమనేది స్ఫురించ నిస్తే గదా. ఊబిలాగా అంతకంత కధః పాతాళాని కణగదొక్కటమే గాని పైకి లేవనివ్వదని. పైకి లేవనివ్వకపోగా ప్రసక్తాః కామ భోగేషు. ఇంకా ఇంకా ఆయా కామభోగాలను భవించాలనే ఆశ నెసకొల్పుతుంటుంది. అది తాళ్లతో బంధించి నట్టు అందులోనే తలమునకలు చేస్తూ పోతుంది. ఇక లేచేదేమిటి. చేసేదేమిటి. పతంతి నరకే శుచౌ పైకి లేవకపోగా పడిపోతారు. తల్లక్రిందులుగా. ఎక్కడ. ఎక్కడో వారికి తెలిస్తేగదా.
ఇహమే పూర్తిగా తెలిసి చావదీ మానవులకు. ఇక పరమేమి తెలుస్తుంది. బుద్ధి జీవి మానవుడు. ఆ బుద్ధికా సీలింగు పెట్టాడా దేవుడు. ఎంతవరకో అంత వరకే దాని సంచారం. పంజరంలో చిలకలాంటిదది. చిలక ఎంత పైకెగర బోయినా ఎంతవరకో అంతే. అంతకు మించి