#


Index

దైవాసుర సంపద్విభాగ యోగము

మొక్కగలరు. ఎన్ని పూజలైనా చేయించి కానుకలైనా చెల్లించి ఆ దేవతల నోళ్లు మూయించగలరు. ఏమైనా చేయగలరు. కనపడని దేవతలకైనా లంచాలు పారేసి తమ కనుకూలం చేసుకోగలరు. మానవులు కల్పించుకొన్న దేవతలే కాబట్టి వారెప్పుడూ వీరి లంచాల కాశ పడేవారే. మానవులు తయారు చేసిన దేవతలకు మానవుల స్వభావాలు గాక అంతకన్నా గొప్ప లక్షణాలెక్కడ నుంచి వస్తాయి. అంచేత ఇహంలో పరంలో తమ ఢాక కడ్డం లేదని బ్రతుకుతుంటారు. అయితే అదంతా వారి భ్రాంతే నంటాడు మహర్షి ఏమిటా భ్రాంతి ఎలా ఉంటుందది వారి నెలా పారేస్తుంది చివరకని అడిగితే చెబుతున్నాడు వినండి. వస్తువును మరచి ఆ భాస వెంట నీవెంతైనా పరుగెత్తి పోవచ్చు. ఆ భాస ఆభాసే. నీ కొంప ముంచుతుంది చివరకు. వస్తువా. దానికి దూరమయ్యారు కాబట్టి అది నిన్నుద్ధరించదు. ఆ భాసా అది ఉద్ధరిస్తుందని వెంటబడ్డా ఆ భాసే కాబట్టి నిన్నసలే ఉద్ధరించదు. మరేమై పోవాలి వీరి బ్రతుకు. ఏమవుతుందో మహర్షే బయట పెడుతున్నాడు.

అనేక చిత్త విభ్రాంతా - మోహజాలస మావృతాః
ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకే 2 శుచౌ - 16

  ఒక చిత్తం కాదు వీరికి. అనేక చిత్తాలు. ఒక్కొక్కటీ ఒక్కొక్క విధంగా తిప్పుతుంటే తిరుగుతుంటారు నిత్యమూ కీలు బొమ్మలలాగా. అనేక చిత్త

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు