#


Index

దైవాసుర సంపద్విభాగ యోగము

ఎవడైనా నేనూ ఉన్నానని ముందుకు వచ్చాడో చెప్పాను గదా వాడిక లోకంలో ఉండడు. సెలవు తీసుకోవలసిందే.

  ఇన్ని పాపకార్యాలు చేస్తున్నావు గదా ఎంత కాలం బ్రతుకుతావు. తరువాత ఈ పాపఫల మనుభవిస్తావని నాకు మీరు మనసులో శాపనార్ధాలు పెడుతూ పోతారా. పరవాలేదు. ఆ శాపాలేవీ నాకు తగలవు. పిల్లి శాపాల కుట్లు తెగిపడతాయా. అవి పాపాలే అయితే పాపాలకు పరిహారా లెన్నో ఉన్నాయి. యక్ష్యే దాస్యామి మోదిష్యే - యజ్ఞ యాగాదులైన ధర్మకార్యాలు అవి నాచేత చేయించే కావలసినన్ని ఉన్నాయి శాస్త్రోక్తమైనవి బ్రాహ్మణులున్నారు. వారంతా నా చెప్పు చేతల్లో ఉన్నవారే. వారి కింత డబ్బు పారేశానంటే నోరు మూసుకొని నాచేత చేయిస్తారవన్నీ. ఎన్నెనా ధర్మకార్యాలు చేస్తాను. ఎంతైనా ధనం పదిమందికీ దానం చేస్తాను. ఇక పాపమనేది నా దరిదాపులకు రాదు. దానితో రేపు నేను కన్ను మూసినా పరలోకాల్లో ఇహంలో మాదిరే మోదిష్యే. దివ్యభోగాలను భవిస్తూ రంభా ద్యప్సరసలతో క్రీడిస్తూ ఆనందంగా గడుపుతాను జీవితం.

  ఈ విధంగా తమలో తాము ఎన్నో గాలిమేడలు కట్టుకొని అందులో శాశ్వతంగా కాపురముండాలని పిచ్చి పిచ్చి ఆశలు పెంచుకొని బ్రతుకుతుంటారీ మూఢ మానవులు. ఇత్యజ్ఞాన విమోహితాః అని ఒక్క మాటతో కొట్టి పారేశారు వ్యాసభట్టారకులు వీరిని. అజ్ఞానమూ

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు