#


Index

దైవాసుర సంపద్విభాగ యోగము

ఈశ్వరోహం. అహం భోగీ - ఈశ్వరు డెక్కడున్నా డసలు. నేనే ఈశ్వరుణ్ణి. ఈ జనాన్ని ఏలటానికి నాకే ఉంది సామర్థ్యమూ అధికారమూ. అధికార సంపదా. సకల భోగాలూ అనుభవించటానికే పుట్టానసలు. నాకు దక్కని భోగమెవరికీ దక్కగూడదు. అన్ని భోగాలకూ హక్కుదారునేనే. సిద్ధోహం బలవాన్ సుఖీ. మానవమాత్రుణ్ణి కాను నేను. దేవలోకం నుంచి దిగి వచ్చిన దివ్య పురుషుణ్ణి. సిద్ధ పురుషుణ్ణి. పుత్ర పౌత్రాదులతో బంధుమిత్రాదులతో ధన ధాన్యాదులతో సకల భోగాలూ అనుభవించాటానికే భూలోకంలో అవతరించాను నేను. మిగతా మానవులందరూ అసలు మానవులే గాదు. భూమి భారాయావతీర్ణాః ఈ భూమికి బరువు చేటు ఉన్నా లేకున్నా ఒకటే వీళ్లంతా నని గజని మీలనంతో చూస్తుంటారు తోడి మానవులను. నా విష్ణుః పృధినీ పతిః అన్నట్టు ప్రజలనంతా పరిపాలించటానికి విష్ణ్వంశతో జన్మించినట్టుగా తమ్ము భావిస్తుంటారు.

  అంతే కాదు. ఆడ్యోభిజన వాస్మి - కావలసినంత డబ్బున్నది నాకు. ఈపాటికే వాళ్ల నోళ్లూ వీళ్ల నోళ్లూ కొట్టి లెక్కకు మిక్కిలిగా సంపాదించాను. రాసులు రాసులుగా పడి ఉంది. ఎంతో గొప్ప కులంలో జన్మించాను. మిగతా ఈ లోకులంతా హీనకులజులే. ధన సంపదలో గాని వంశ ప్రతిష్ఠలో గానీ అందరూ నాకు తీసికట్టే. కోన్యోస్తి సదృశో మయా. ఇంతవాణ్ణి నేను. నాతో ఎవడు సాటి రాగలడు. నాకు సమానుడీ లోకంలో ఎవడూ లేడు.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు