#


Index

దైవాసుర సంపద్విభాగ యోగము

సంపాదించి ఆ తరువాత ఎవరెంత వాపోయినా పట్టించుకోక విశృంఖలంగా లోకులందరి పైనా అధికారం చెలాయిస్తూ తమ పబ్బం గడుపుకొంటూ పోయే నరరూప రాక్షసులనే గదా ఇప్పుడు పాలకులని మనం బ్రహ్మరధం పడుతున్నది. ఇక వ్యాసభగవానుడన్న మాటలో తప్పేమున్నది. ఇంతే కాదు. ఇంకా కళ్లకు కట్టినట్టె లా వర్ణిస్తున్నాడో చూడండి వీరి వ్యవహారం.

అసౌ మయా హతః శత్రుః - హనిష్యే చాపరా నపి
ఈశ్వరోహ మహం భోగీ - సిద్ధోహం బలవాన్ సుఖీ - 14

ఆధ్యోభి జనవా నస్మి కోన్యో స్తి సదృశో మయా
యక్ష్యే దా స్యామి మోదిష్య - ఇత్యజ్ఞాన వి మోహితాః - 15

  అసౌ మయా హతశ్శత్రుః - హనిష్యేచాపరాన్. ఇదుగో వీణ్ణి నా దారి కడ్డం తీసేశాను. వీళ్లే కాదు. ఇలాంటి వాళ్లెవరడ్డమైనా బ్రతకరు. బ్రతికే యోగం లేదు వాళ్ళకు. వీడికి పట్టిన గతే వాడికీ పడుతుంది. నేను తలుచుకొంటే ఎవడైనా ఎంతవాడైనా సరే. నా చేతిలో హతమై పోవలసిందే. అక్కడికి వాడు ఖతమై పోవలసిందే. కాకున్నా నా అంత వాడితో పోటీ పదతాడా ఈ పనికి మాలినవాడు. వీడెంత వీడి బిసా తెంత.

  నేనెవడినో వీడి కసలర్థం కావటం లేదు. అందుకే కొండతో తగరు ఢీ కొంటున్నట్టు నాతో తలపడుతున్నాడు. మసై పోతాడు.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు