భవించాను. ఇది చాలదు నాకు. ఇదం ప్రాప్స్యే మనోరధం. ఎంతో ఉంది నాకు కాంక్ష. అది తీరనంత వరకూ ఇంత ఉన్నా సుఖం లేదు నాకు. శాంతి లేదు. కాబట్టి నా మనోరధం పూర్తిగా తీరేవరకూ ఇంకా ప్రయత్నించ వలసిందే. అప్పుడి దమస్తి ఇదమపిమే భవిష్యతి. ఇది ఉంది. ఇంకా సాధిస్తే అదీ ఉంటుంది నాకు. అది ధనమే కానక్కర లేదు. ధనముంటే పదముంటుంది Status. పదముంటే ధనముంటుంది. అని ఇలా ఎన్నెన్నో కలలు కంటుంటాడు మానవుడు. ఆకల నిజం చేసుకోవాలని ఎంతెంతో తాపత్రయ పడుతుంటాడు.
ఇది ఈనాటి రాజకీయాల కెంత చక్కగా వర్తిస్తుందో చూడండి. రాజకీయమే గాని Politics ఇప్పుడు రాజనీతి Political Science or Wisdom ఎక్కడున్నది. ఏదో గోలుమాలు చేసి అవలీలగా పదవులు కొట్టేయాలని పైకి రావాలనేగా మానవుల ఆశ. ఆ పదవికి నేను తగుదునా నాకలాటి అర్హత ఉందా లేదా అని ఎవడాలోచిస్తున్నాడు. ఒక విద్యా విజ్ఞానమా సంస్కారమా నీతా నియమమా ఏముందని. ఎవరి కుందని. అలాటి యోగ్యత ఉన్న పెద్దమనిషి అసలు దేన్నీ ఆసించడు. ముందుకు పడడు. వాడెక్కడ వస్తాడోనని వెనక్కు నెట్టి మందీ మార్బల్యాన్ని పోగు చేసుకొని పదిమందినీ బెదిరించి వేలు లక్షలూ వెదజల్లి ఎన్నో లాభాలు వారికి ఎర చూపి తమకు వశం చేసుకొని అంతకంత కున్నతమైన పదవులు